అశ్లీల మెసేజ్ లు పంపించాడు: మూడు నెలలు జైలు
ముంబై: యువతికి అశ్లీలమైన ఈ మెయిల్స్ పంపిస్తు నిత్యం వేధింపులకు గురి చేసిన యువకుడు జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. యువతులు, మహిళలను వేధించే ఇలాంటి వారికి జైలు శిక్ష విధించడం తప్పు కాదని ముంబై కోర్టు చెప్పింది.
వివరాలలోకి వెళితే 2009లో సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్ ద్వారా యోగేష్ ప్రభు అనే వ్యక్తి ఒక యువతితో స్నేహం పెంచుకున్నాడు. నిత్యం ఇద్దరు సోషల్ మీడియాలో టచ్ లో ఉండే వారు. అయితే కొంత కాలం తరువాత యోగేష్ ప్రభు ప్రవర్తనలో చాల మార్పు వచ్చింది.

యోగేష్ ప్రభు ప్రవర్తన నచ్చకపోవడంతో యువతి తన స్నేహితుల లిస్ట్ నుండి (గ్రూప్) అతని పేరు తొలగించింది. అయితే అతను నిత్యం పదేపదే అశ్లీల చిత్రాలు, మెసేజ్ లను ఈ మెయిల్స్ ద్వారా ఆమెకు పంపించేవాడు.
చాలసార్లు ఆమె సున్నితంగా యోగేష్ ప్రభును మందలించింది. అయితే యోగేష్ ప్రభు రెచ్చిపోవడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. యోగేష్ ప్రభు నేరం చేసినట్లు రుజువు కావడంతో న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విదించిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications