వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియునితో భార్య: భర్త ఆత్మహత్య, వీడియో రికార్డు

|
Google Oneindia TeluguNews

Suicide
ముంబై: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా దేశంలోని పలు నగరాల్లో హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే ముంబై నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియునితో పారిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ తన సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసుకున్నాడు.

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సెంట్రల్ ముంబైలోని అగ్రిపాడలోని తన నివాసంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సునీల్ ఉగ్డే ఉరివేసుకుని కనిపించినట్లు అతని తల్లి పోలీసులకు సమాచారం అందించింది. తన సెల్‌ఫోన్‌లోని వీడియోను చూడాలని ఒక నోట్ పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీడియో చిత్రీకరించి ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారని పోలీసులు భావిస్తున్నారు.

తను చిత్రీకరించిన వీడియోలో తన భార్య అనురాధ, ఆమె ప్రియుడు అబ్దుల్ వహబ్ అలియాస్ చోటుతో తరచూ తిరుగుతుండేదని సునీల్ చెప్పాడు. తన ఆత్మహత్యకు వారిద్దరే కారణమని ఆ వీడియోలో సునీల్ పేర్కొన్నాడు. అబ్దుల్ వహబ్ నుంచి తన భార్యను తీసుకురావాలని అగ్రిపాడ సబ్‌ ఇన్‌స్పెక్టర్ అజిత్ పదంను ఆదివారం రాత్రి కోరినట్లు తెలిపాడు. తన ఫిర్యాదుతో చర్యలు తీసుకోకుండా తన పట్ల అవహేళనగా మాట్లాడాడని చెప్పాడు. దీంతో చావు తప్ప మరో మార్గం లేదని భావించి ఆత్మహత్య చేసుకున్నట్లు సునీల్ వీడియోలో పేర్కొన్నాడు.

దొంగలు పడ్డ ఆరు నెలలకు పోలీసులు వచ్చిన సామెతను నిజం చేస్తూ.. ఫిర్యాదు చేసిన భర్త సునీల్ చనిపోయిన తర్వాత అతని భార్య అనురాధ, ఆమె ప్రియుడు అబ్దుల్ వహాబ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఐపిసి 306, 506 సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారికి శుక్రవారం వరకు కస్టడీ విధించిందని సీనియర్ ఇన్‌స్పెక్టర్ కిశోర్ భావిస్కర్ తెలిపారు. ఇన్‌స్పెక్టర్ అజిత్ కదం వ్యవహారంపై స్పందించేందుకు కిశోర్ భావిస్కర్ నిరాకరించారు. కాగా తన కోడలు పెడదారి పట్టడం వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని సునీల్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

English summary
In probably the first case of its kind, a 38-year-old driver hanged himself in the early hours of Tuesday after calmly recording a 19-minute video on his cell phone accusing his wife of 18 years and her paramour -and a policeman in part -of driving him to suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X