లేడీస్ హాస్టల్‌లో దూరిన సైకో: యువతిపై కత్తితో దాడి

హైదరాబాద్: ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ లేడీస్ హాస్టల్‌లోకి సైకో చొరబడి వీరంగం సృష్టించాడు. అడ్డుకునేందుకు వచ్చిన ఓ యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, దాడి చేసిన యువకుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరంలోని మీర్‌పేట జిల్లెగూడలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితుల కన్నా తక్కువ మార్కులు వచ్చాయనే మనస్థాపంతో టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

 A man has allegedly attacked on a girl with knife

నాలుగంతస్థుల పైనుంచి పడి మహిళ మృతి

వనస్థలిపురం ఆగమయ్యనగర్‌లో కొద్ది సేపటి క్రితం నాలుగంతస్థుల భవనంపై నుంచి పడి ఓ మహిళ(45) మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతురాలు ప్రమాదవశాత్తు పడిందా?.. లేక ఎవరైనా తోసివేశారా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

ఆటో బోల్తా: దంపతుల మృతి

నిజామాబాద్ జిల్లాలోని మక్లూర్ మండలం చిన్నాపూర్ సోమవారం ప్రమాదవశాత్తూ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+