ఘోరం: పద్నాలుగేళ్ల కూతురిని రేప్ చేయాలని 6 నెలలుగా యత్నం

నిందితుడు ఆటో రిక్షా నడుపుతుంటాడు. అతనికి పద్నాలుగేళ్ల కూతురు ఉంది. గత కొన్ని నెలలుగా తన కూతురు పైనే అత్యాచారం చేసేందుకు అతను ప్రయత్నాలు చేశాడు. దీంతో ఆమె తల్లి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, అతనిని అరెస్టు చేశారు.
పోలీసులు అధికారి ముఖేష్ కున్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రి కరంవీర్ తనను సోమవారం లైంగికంగా వేధించాడని, అత్యాచారానికి ప్రయత్నించాడని, దీంతో తాను రక్షించాలని అరిచానని, తన పక్కింటి వారు వచ్చి రక్షించారని తెలిపింది.
బాలిక, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని మంగళవారం అరెస్టు చేశామన్నారు. తన భర్త పలుమార్లు తన కూతురు పైన అత్యాచారయత్నం చేశాడని, ఆరేడు నెలలుగా ఆయన వేధిస్తున్నారని ఆరోపించింది. తన చర్యలను ప్రతిఘటిస్తే.. అతను తిట్టడమే కాకుండా, తమను తోసివేసే వాడని చెప్పారు. అతను ఓసారి పదునైన ఆయుధంతో కూడా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications