మనుషులేనా?: కోతిని కట్టేసి కర్రతో చావబాది, చెట్టుకు వేలాడ దీసి, చిత్రహింసలు

Recommended Video

    ఈ మూర్ఖులు చూడండి పాపం కోతిని ఎంత దారుణంగా చంపేసారో!!

    ముంబై: ఓ యువకుడు మానవ రూపంలో ఉన్న రాక్షసుడిలా ప్రవర్తించాడు. అతని పైశాచికానికి ఓ కోతి ప్రాణాలు కోల్పోయింది. కోతిని చెట్టుకు కట్టేసి కొట్టిన తర్వాత.. మరోసారి కిందపడేసి పెద్ద కర్రతో చావబాదాడు.

    దెబ్బలకు తాళలేక ఆ కోతి ఆర్థనాదాలు చేస్తున్నా.. ఆ దుర్మార్గుడి హృదయం కరగలేదు. ఇంకా కొట్టడంతో ఆ కోతి ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని వాసిం జిల్లా రిసోడ్ పరిధిలోని కురా గ్రామంలో చోటు చేసుకుంది.

    ఆనందంగా గంతులేసుకుంటున్న కోతిని.. ఆశ చూపి

    ఆనందంగా గంతులేసుకుంటున్న కోతిని.. ఆశ చూపి

    వివరాల్లోకి వెళితే.. కురా గ్రామంలోని పొలాల్లో ఒక కోతి ఆనందంగా తన సహజ లక్షణమైన అటు ఇటూ గంతులేసుకుంటూ తిరుగుతోంది. ఆ సమయంలో పవన్ బంగార్ అనే బాలుడు తన స్నేహితులతో పాటు అటు వెళుతున్నాడు. వారు ఆ కోతికి ఆహారం ఆశచూపి పట్టుకున్నారు.

    ఆర్థనాదాలు చేస్తున్నా..

    ఆర్థనాదాలు చేస్తున్నా..

    ఆ తర్వాత పవన్ దానిని కర్రతో కొట్టడం ప్రారంభించాడు. దెబ్బలకు తాళలేక ఆ కోతి ఆర్థనాదాలు చేస్తున్నా.. ఆ దుర్మార్గుడికి దానిపై జాలి కలగలేదు. కర్ర దెబ్బలతో తీవ్రంగా గాయపడిన దానిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీశాడు.

    చిత్రహింసలు పెట్టారు..

    చిత్రహింసలు పెట్టారు..

    అప్పుడు కూడా వదలని ఆ నీచుడు.. మరోసారి కోతిని కొడుతూ చిత్రహింసలకు గురిచేశాడు. చివరకు ఆ దుర్మార్గుడి చేతిలో ఆ వానరం ప్రాణాలు వదిలింది. ఈ పైశాచికాన్నంతా అతని స్నేహితులు వీడియో తీశారు.

    ఆ దుర్మార్గుల అరెస్ట్

    ఆ దుర్మార్గుల అరెస్ట్

    కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఆ వీడియో పోలీసులు, అటవీశాఖ అధికారుల వరకూ వెళ్లడంతో నిందితులను అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.

    కోతికి అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్తులు

    కోతికి అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్తులు

    కాగా, కోతిని దారుణంగా చంపిన విషయం తెలిసిన గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురయ్యారు. ఆ యువకులను కఠినంగా శిక్షించాలన్నారు. కాగా, హిందూ సాంప్రదాయ బద్ధంగా ఆ వానరానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఊరు ఊరంతా ఈ కోతి అంత్యక్రియాల్లో పాల్గొనడం గమనార్హం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+