వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పు తీర్చలేక భార్య అప్పగింత: రేప్ చేశారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తీసుకున్న అప్పు తీర్చలేక ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్యనే స్నేహితులకు అప్పజెప్పాడు. అంతేగాక, ఆమెపై అత్యాచారం చేయించాడు ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఖాందారి ప్రాంతానికి చెందిన విక్రమ్ వివాహమైన కొద్ది రోజుల తర్వాత భార్యను డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన స్నేహితుల దగ్గర అప్పుచేశాడు.

తీసుకున్న అప్పు తీర్చలేక తన భార్యని స్నేహితులతో పంపించేశాడు. దాదాపు ఆరు నెలలపాటు ఈ అరాచకాన్ని భరించిన బాధితురాలు భర్త నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Man held for sexual assault

అక్కడ కూడా ఆమెకు న్యాయం జరగకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో కదిలిన పోలీసులు బాధితురాలి భర్తతోపాటు ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నారికి లైంగిక దాడి: వ్యక్తి అరెస్ట్

పొరుగింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తి(45)ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సెంటర్ ఢిల్లీలోని పటేల్‌నగర్‌లో చోటు చేసుకుంది.

English summary
A 45-year-old man has been arrested from central Delhi's Patel Nagar for allegedly sexually assaulting his four-year-old neighbour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X