ఆంధ్ర గర్ల్స్‌ను పెళ్లి పేరుతో వ్యభిచారంలోకి దించాడు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలకు పోలీసులు విముక్తి కలిగించారు. రాజన్ లేదా మణిగా పేరు పొందిన ఎన్ రామరాజన్ చెన్నైలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన పథకానికి అనుగుణమైన విధానాన్ని ఎంపిక చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని అప్పర్ మిడిల్ క్లాస్ వ్యాపారుల వద్ద డ్రైవర్‌గా చేరుతూ ఉండేవాడు. తనకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి అమ్మాయిని వలలో పడేసి, తనతో పాటు చెన్నైకి తీసుకుని వచ్చి వ్యభిచారంలో దించుతూ వచ్చాడు. చెన్నైలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని తన వెంట వచ్చిన అమ్మాయితో కాపురం పెట్టినట్లుగా కొన్ని నెలలు కలిసి ఉండేవాడు. ఆ తర్వాత వ్యభిచారంలోకి నెట్టేవాడు.
అతను 2012లో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. 2013లో కోయంబేడు పోలీసులు అరెస్టు చేశారు. అతనితో ఇద్దరు అతని అనుచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తమకు అందిన సమాచారంతో పోలీసులు మంగళవారంనాడు సాలిగ్రామంలోని అపార్టుమెంటుపై దాడి చేసి అతన్ని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications