పీకలదాక తాగి కూతురిపై ఆరు నెలలుగా అత్యాచారం: భర్తను పట్టించిన భార్య !

కామంతో కళ్లు మూసుకుపోయి ఇంటిలో ఎవరూ లేని సమయంలో కన్నకూతురిపై గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్న తండ్రిని చెన్నైలోని తేనంపేట పోలీసులు అరెస్టు చేశారు. కామాంధుడైన భర్తను స్వయంగా ఆమె భార్య పట్టించిందని పో

చెన్నై: కామంతో కళ్లు మూసుకుపోయి ఇంటిలో ఎవరూ లేని సమయంలో కన్నకూతురిపై గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్న తండ్రిని చెన్నైలోని తేనంపేట పోలీసులు అరెస్టు చేశారు. కామాంధుడైన భర్తను స్వయంగా ఆమె భార్య పట్టించిందని పోలీసులు చెప్పారు.

బీహార్ కు చెందిన 44 ఏళ్ల వ్యక్తి భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి చెన్నై చేరుకుని ఉళ్లవర్ కోట్టం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతను సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాడు. అతను నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. గత ఆరు నెలల నుంచి మద్యం మత్తులో కుమార్తె మీద అత్యాచారం చేస్తున్నాడు.

Man held for raping daughter for six months

విషయం బయటకు చెబితే చంపేస్తానని కుమార్తెను బెదిరించాడు. తల్లికి ఈ విషయం చెప్పడానికి భయపడిన బాధితురాలు తండ్రి అరాచకం గురించి సోదరుడికి చెప్పింది. సోదరుడితో కలిసి బాధితురాలు చైల్డ్ లైన్ తోపాటు తైనంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కుమార్తె మీద తన భర్త అత్యాచారం చేస్తున్నాడని తెలుసుకున్న భార్య స్వయంగా కామాంధుడైన భర్తను పోలీసులకు పట్టించింది. కామాంధుడిని సైదాపేట మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని, నిందితుడిని జుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+