ప్రేయసి కూతురిపై వ్యక్తి అత్యాచారం, బిడ్డకు జన్మ

మైసూరులోని కనకగిరికి చెందిన మహేష్ గౌడ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శిశు సంక్షేమ కమిటీ మంగళవారంనాడు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.
నిందితుడిని పట్టుకోవడానికి చైల్డ్ హెల్ప్‌లైన్, ఒడనాడి సేవా సంస్థ పోలీసులకు సహాయం అందించాయి. చిన్న చిన్న పనులు చేసే మహేష్ బాధితురాలి తల్లి ప్రియుడు. మహేష్ విధవ అయిన మహిళకు సహాయం చేస్తూ వచ్చాడని, ఈ క్రమంలో వారిద్దరికి మధ్య ప్రేమ ఏర్పడిందని ఒడనాడి సేవా సంస్థ పర్యవేక్షకుడు ప్రభామణి ఎస్ అంటున్నారు.
ఏడాది క్రితం మహేష్ తన ప్రేయసి కూతురిని లైంగికంగా దోపిడీ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. అయితే, మహేష్‌పై తల్లి ఫిర్యాదు చేయలేదు. దక్షిణ మైసూరులోని ఓఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎన్జీవోకు సమాచారం అందించడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications