నమ్మలేని నిజం: భార్యను రేప్ చేసిన భర్త
నోయిడా: భార్యపై అత్యాచారం చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని పరారైన నిందితుడిని నోయిడాలోని పార్థల పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర బంగారు గొలుసు లేకపోవడంతో జైలుకు పంపించారు.
నోయిడాలోని సెక్టార్ 120 ఫేజ్ 3లో నివాసం ఉంటున్న మహిళ ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం మేరకు బీహార్ కు చెందిన యువతి ఉద్యోగం కోసం నోయిడా వెళ్లింది.
2013లో అభయ్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం అయ్యింది. దాదాపు 18 నెలల ఇద్దరూ సహజీవనం చేశారు. 2015లో ఆమె, అభయ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. కొన్నినెలలు ఇద్దరు సంతోషంగా నే ఉన్నారు.

తరువాత చిన్నచిన్న విషయాల్లో ఇద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. కొంత కాలం నుంచి అభయ్ వేరుగా నివాసం ఉంటున్నాడు. ఇద్దరూ వేర్వేరు ప్రయివేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. గత వారం ఇంటికి వెళ్లిన అభయ్ భార్య మెడలో ఉన్న బంగారు గొలుసు ఇవ్వాలని చెప్పాడు.
అందుకు ఆమె నిరాకరించింది. చివరికి భార్య మీద అత్యాచారం చేసిన అభయ్ ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కోని అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి రావాలని, బంగారు గొలుసు ఇవ్వాలని ఆమె అభయ్ కు చెప్పింది.
అయితే అతను చెప్పిన మాట వినకుండా నీచేతనైయ్యింది చేసుకో అని చెప్పాడు. విసిగిపోయిన బాధితురాలు సెక్టార్ 120 ఫేజ్ లోని పార్థల పోలీస్ స్టేషన్ లో భర్త అభయ్ మీద ఫిర్యాదు చేశారు. స్టేషన్ అధికారి పంకజ్ పంత్ ఆదేశాల మేరకు పోలీసులు అతని కోసం గాలించారు.
నోయిడా నగరం నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న అభయ్ ని ప్రయివేట్ బస్ స్టాండ్ లో అరెస్టు చేశామని, నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపించామని నోయిడా పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications