నేను సీఈవో మాట్లాడుతున్నా: విదేశీ మహిళకు ఉద్యోగం ఎర, ఢిల్లీలో ఆరు నెలలుగా రేప్ !
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి విదేశీ మహిళను భారత్ కు రప్పించి నిరంతరం రేప్ చేస్తున్న కామాంధుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి విదేశీ మహిళను భారత్ కు రప్పించి నిరంతరం రేప్ చేస్తున్న కామాంధుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇంత కాలం తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని ముంబైలో అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.
సోనూ అలియాస్ జగ్జీత్ సింగ్ (34) అనే కామాంధుడిని అరెస్టు చేసి అతని నుంచి విదేశీ మహిళ పాస్ పోర్టు, ఫోన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అన్నారు. ఇతను ఇంకా ఎంత మందిని ఇలా మోసం చేసి అత్యాచారం చేశాడు అని ఆరా తీస్తున్నామని ఢిల్లీ నగర పోలీసులు చెప్పారు.

ఉబ్జెకిస్థాన్ యువతి
ఉబ్జెకిస్థాన్ లో నివాసం ఉంటున్న 27 ఏళ్ల యువతి విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఆమెకు ఆ దేశంలోనే ఓ స్నేహితురాలు ఉంది. యువతి స్నేహితురాలికి ముంబైకి చెందిన సోనూ అలియాస్ జగ్జీత్ సింగ్ కు పరిచయం ఉంది.

నేను సీఈవో అంటూ పరిచయం !
ఓ ప్రైవేటు కార్పొరేట్ సంస్థలో తాను సీఈవో అంటూ 27 ఏళ్ల యువతికి సోనూ ఫోన్ చేశాడు. మీ స్నేహితురాలు నాకు ఫ్రెండ్, మీరు ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకున్నానని, మా కంపెనీలో మీకు ఉద్యోగం ఇస్తానని సోనూ ఆమెను నమ్మించాడు.

ఎనిమిది నెలల క్రితం
ఎనిమిది నెలల క్రితం ఉబ్జెకిస్థాన్ కు చెందిన యువతికి ఫోన్ చేసిన సోనూ ఆమెను ఢిల్లీ పిలిపించుకున్నాడు. తరువాత ఓ కంపెనీ దగ్గరకు కారులో తీసుకెళ్లాడు. బయట నుంచి ఇదే నా కంపెనీ అంటూ ఆమెకు చూపించాడు. అక్కడి నుంచి దక్షిణ ఢిల్లీలోని మెహ్రూలి ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు.

ఆరు నెలలు రేప్
యువతిని మెహ్రూలి ప్రాంతంలోని నిర్బంధించిన సోనూ ఆమె పాస్ పోర్టు లాక్కోన్నాడు. ఉద్యోగం ఇస్తానని నమ్మించి రప్పించిన యువతి మీద గత ఆరు నెలల నుంచి అత్యాచారం చేశాడు. కేకలు వేసినా, బయటకు వెళ్లాలని ప్రయత్నించినా పాస్ పోర్టు తగలబెడుతానని ఆమెను బెదిరించాడు.

తప్పించుకున్న యువతి
సోనూ నెల క్రితం బయటకు వెళ్లిన సమయంలో బాధితురాలు ఇంటి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి మాయం అయిన సోనూ ముంబైలోని రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడు. కామాంధుడి ఆచూకి తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications