దారుణం: కూతురుపై లైంగిక దాడి, నిందితుడి అరెస్ట్

కాగా, ఫుట్‌పాత్ పైనే జీవనం సాగిస్తున్న నిందితుడు అతని పెద్ద కుమార్తె(10)పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక 2013, డిసెంబర్‌లో అక్కడ్నుంచి పారిపోయింది. కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో బాధిత బాలికను గుర్తించిన రైల్వే పోలీసులు, ఆమెను డోంగ్రీలోని బాలికల వసతి గృహానికి తరలించారు.
అప్పట్నుంచి బాలిక అక్కడే నివాసం ఉంటోంది.
తనపై తన తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధిత బాలిక ఏప్రిల్ 15న వసతి గృహం నిర్వాహకులకు తెలిపింది. బాలిక వాదనను రికార్డు చేసిన వసతి గృహ నిర్వాహకులు పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపిసి 376, 354 (డి) సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications