మహిళ వెనక పబ్లిక్‌గా వ్యక్తి లైంగిక కార్యం: అరెస్టు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ వ్యక్తి అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. ఓ మహిళ వెనక బహిరంగంగా లైంగిక కార్యానికి పూనుకున్నాడు.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 47 ఏళ్ల వయస్సు గల వ్యక్తి అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. ఓ మహిళ పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడిని హరిరామ్ భిష్ణోయ్‌గా గుర్తించారు.
అతను ఓ మహిళ వెనక బహిరంగంగా లైంగిక క్రియకు పూనుకున్నాడు. ముంబైలోని చర్చిగేట్ స్టేషన్ బయట తన భర్త కోసం నిరీక్షిస్తన్న మహిళ పట్ల అతను అవమానకరమైన రీతిలో ప్రవర్తించాడు.

ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. బిష్ణోయ్ చర్యను ఓ కారు డ్రైవర్ గుర్తించాడు. అతని చర్యను చిత్రీకరించి, అతన్ని పట్టుకున్నాడు.
అతను ప్రవర్తిస్తున్న తీరును గుర్తించని మహిళను కారు డ్రైవర్ అప్రమత్తం చేశాడు. వీడియో చూసిన తర్వాత తమకు ఆ విషయం తెలిసిందని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications