మహిళా టెలివిజన్ జర్నలిస్టుకు రోడ్డుపై ఫ్లయింగ్ కిస్

రాహుల్ వెస్ట్ శాంటాక్రాజాలోని గజదర్బంధ్ ప్రాంతంలో ఉంటూ ఓ ప్రయివేటు సంస్థలో పని చేస్తున్నాడు. వివరాల మేరకు.. ఇరవై రెండేళ్ల ఓ మహిళా విలేకరి స్థానిక టీవి ఛానల్లో పని చేస్తున్నారు.
శనివారం రాత్రి తన కార్యాలయ విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు రాత్రి పదకొండు గంటల సమయంలో సాగాలే చౌక్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
ఆమె వెళ్తుండగా ఓ వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. షాక్‌కు గురైన ఆమె వెంటనే అక్కడే ఉన్న ఓ పోలీసుకు ఫిర్యాదు చేసింది. నిందితుడిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఫ్లయింగ్ కిస్ ఎందుకిచ్చాడో అతను చెప్పడం లేదని సమాచారం. రాహుల్ పైన పోలీసులు 509 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications