నన్ను పెళ్లి చేసుకో లేదంటే నీ తండ్రి ప్రాణాలతో ఉండడు: బాలీవుడ్ ఫిక్కీలో కిడ్నాప్
ఢిల్లీ:తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందన్న నెపంతో యువతి తండ్రిని కిడ్నాప్ చేసి తనతో పెళ్లికి ఒప్పించేలా చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాడు ఓ వ్యక్తి. సినిఫిక్కీలో జరిగిన ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు ఈ వ్యక్తిని గుర్తించి ఢిల్లీలోని ఓ హోటల్‌లో అరెస్టు చేశారు.

యువతిని ప్రేమించిన సంజీవ్
ఢిల్లీకి చెందిన సంజీవ్ అనే 24 ఏళ్ల యువకుడు ఓ ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ద్వారకాలో నివాసముంటున్న ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఒక ఏడాదిగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇక పెళ్లి చేసుకుందామనే సమయానికి తల్లిదండ్రులు అడ్డుపడ్డారు. తమ పెళ్లికి వారు ఒప్పుకోలేదు. తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేసింది యువతి. కానీ ఫలించలేదు. ఇక చివరి ప్రయత్నంలో తల్లి దండ్రులు తమ పెళ్లికి ఒప్పుకుని ఈ ఏడాది ఆరంభంలో ఎంగేజ్‌మెంట్ కూడా జరిపించారు. పెళ్లికి కొద్ది రోజుల సమయం ఉందనగా సంజీవ్ బుద్ధి వంకర తిరిగింది. మరో అమ్మాయితో సంబంధాలు నెరుపుతున్నాడన్న విషయం ముందు అమ్మాయికి తెలిసింది. ఇక సంజీవ్ బుద్ధి మంచిది కాదని తెలుసుకున్న యువతి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది.

తండ్రిని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్
ఇక ఆ యువతి పెళ్లికి నిరాకరించడంతో సంజీవ్ బుద్ధి మరోలా తిరిగింది. తన నిర్ణయం మార్చుకోవాల్సిందిగా పలుమార్లు అమ్మాయిపై సంజీవ్ ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇక ఇది ఫలించకపోవడంతో తన కుటుంబాన్ని బెదరించసాగాడు సంజీవ్. అతని నుంచి ప్రమాదం ఉందని భావించిన అమ్మాయి కుటుంబం సొంత ఊరు భోపాల్‌కు వచ్చేసింది.అయితే తన తండ్రి మాత్రం ఉద్యోగ రీత్యా ఢిల్లీలోనే ఉన్నాడు. ఇక అమ్మాయి ఢిల్లీలో లేకపోవడంతో ఆమె తండ్రిని కిడ్నాప్ చేశాడు సంజీవ్. ఆయన్ను కిడ్నాప్ చేసేందుకు సంజీవ్ మిత్రులు అంకుర్, జానీలు సహాయం చేశారు. ఒక కారును తీసుకుని యువతి తండ్రి పనిచేసే చోటుకు వెళ్లారు. ఆదివారం ఉద్యోగం రీత్యా అమ్మాయి తండ్రి ఆఫీసుకు రాగానే ఆయన్ను ఎత్తుకెళ్లి కారులో ఎక్కించి మథురావైపు తీసుకెళ్లారు. తను మంచి వాడినని తన కూతురు పెళ్లిచేసుకునేలా ఒప్పించాలంటూ ఫోన్ చేయమని చెప్పాడు. అంతేకాదు తన తండ్రి ప్రాణాలతో ఉండాలంటే తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు సంజీవ్.

టెక్నాలజీ
టెక్నాలజీ వినియోగించి సంజీవ్‌ను అరెస్టు చేసిన పోలీసులు
ఈ సమయంలోనే అమ్మాయి తండ్రి పనిచేసే ఉద్యోగులు కిడ్నాప్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్నాలజీ వినియోగించి పోలీసులు సంజీవ్ ఎక్కడున్నాడో పసిగట్టారు. నేరుగా మథురాలోని ఓ హోటల్‌కు వెళ్లి సంజీవ్‌ను అరెస్టు చేశారు. తనను పెళ్లి చేసుకునేందుకు యువతి నిరాకరించడంతోనే తన తండ్రిని కిడ్నాప్ చేసి అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని చూసినట్లు పోలీసులు విచారణలో సంజయ్ వెల్లడించాడు. ఇక పరారీలో ఉన్న సంజీవ్ స్నేహితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications