భార్య మీద అనుమానం, పెళ్లి రోజే గోతిలో పూడ్చి పెట్టి భర్త డ్రామాలు, బెండ్ తీస్తే!
బెంగళూరు: పెళ్లి జరిగిన రోజే భార్య మీద అనుమాతంతో ఆమెను కిరాతంగా హత్య చేసిన భర్త అటవీ ప్రాంతంలో గోతి తీసి పాతిపెట్టాడు. తన భార్య ఎవ్వరితోనే వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నించి డ్రామాలు ఆడాడు. చివరికి పోలీసులు బెండ్ తియ్యడంతో అసలు విషయం బయట పెట్టాడు. పెళ్లి జరిగిన రోజే నవ వధువు దారుణ హత్యకు గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

స్కూల్ లో లవర్స్
కర్ణాటకలోని మైసూరు జిల్లా, పిరియపట్టణ తాలుకా లక్ష్మీపుర గిరిజన అటవీ గ్రామంలో నాగరాజ (19), నాగమ్మ (18) నివాసం ఉంటున్నారు. హణసూరులోని గిరిజన ఆశ్రమంలో నాగరాజ, నాగమ్మ విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. ఇద్దరూ 10వ తరగతి వరకు చదువుకున్నారు.

నాగమ్మ గర్బవతి
10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన నాగరాజ, నాగమ్మ గిరిజన గ్రామానికి చేరుకున్నారు. ఇటీవల నాగమ్మ గర్బవతి అయ్యింది. నువ్వు ప్రేమించి తన కుమార్తె నాగమ్మను గర్బవతిని చేశావని, వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లి గౌరమ్మ నాగరాజకు చెప్పింది.

కడుపులో బిడ్డకు నాకు సంబంధం లేదు
నాగమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పెళ్లి చేసుకోనని నాగరాజ గౌరమ్మకు చెప్పాడు. పెళ్లి చేసుకోవడానికి నాగరాజ నిరాకరించడంతో గౌరమ్మ గిరిజన గ్రామ పెద్దలను ఆశ్రయించి న్యాయం చెయ్యాలని వేడుకుంది.

పంచాతీ పెద్దల వార్నింగ్
పంచాయితీ చేసిన గిరిజన గ్రామ పెద్దలు వెంటనే నాగమ్మను పెళ్లి చేసుకోవాలని, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని నాగరాజను హెచ్చరించారు. గ్రామ పెద్దలు దగ్గర ఉండి అక్టోబర్ 10వ తేదీన నాగరాజ, నాగమ్మల వివాహం జరిపించారు. ఇద్దరూ వేరుగా ఉంటామని చెప్పిన నాగరాజ భార్య నాగమ్మను పిలుచుకుని గిరిజన గ్రామం నుంచి బయటకు వెళ్లాడు.

పెళ్లి రోజే భార్యను చంపేశాడు
భార్య నాగమ్మను గ్రామం నుంచి బయటకు పిలుచుకుని వెళ్లిన నాగరాజు అటవీ ప్రాంతం సమీపంలోని కల్లుగుడ్డ దగ్గరకు తీసుకెళ్లాడు. అనంతరం నాగమ్మ తల మీద బలమైన ఆయుధంతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేశాడు. భార్య నాగమ్మ శవాన్ని కల్లుగుడ్డ ప్రాంతంలో గోతి తీసి పాతి పెట్టిన నాగరాజ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

బెండ్ తీసిన పోలీసులు
ఒంటరిగా గ్రామానికి వెళ్లిన నాగరాజను తన కుమార్తె నాగమ్మ ఎక్కడ అని గౌరమ్మ ప్రశ్నించింది. నీ కూతురు ఎవ్వరితోనో వెళ్లిపోయిందో తనకు ఏమీ తెలీదని, నువ్వే వెతికి తీసుకురావాలని నాగరాజ సమాధానం ఇచ్చాడు. గౌరమ్మ బెట్టపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్టోబర్ 17వ తేదీ రాత్రి నాగరాజను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బెండ్ తియ్యడంతో నాగమ్మను హత్య చేసినట్లు అంగీకరించాడు. పిరియపట్టణ తహసిల్దార్ శ్వేతా, డీఎస్పీ సుందర్ సమక్షంలో శుక్రవారం నాగమ్మ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టుం చేశారు. నాగరాజను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications