దారుణం : చిన్న కారణానికే తల్లిదండ్రులు,సోదరుడిని హత్య చేసిన మైనర్

తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని వారిని దారుణంగా హతమార్చాడో కొడుకు. ఆ తర్వాత తమ్ముడిని కూడా హత్య చేశాడు. ఆపై ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఇంట్లోకి వెళ్లి చూసిన పోలీసులకు మూడు మృతదేహాలు కనిపించాయి. అందులో ఇద్దరిని గన్‌తో కాల్చి చంపగా.. ఒకరిని గొంతు నులిమి చంపినట్టుగా పోలీసులు నిర్దారించారు. మధ్యప్రదేశ్‌లోని మాక్రొనియాలో ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగింది..

అసలేం జరిగింది..

మాక్రోనియాకు చెందిన 17 ఏళ్ల ఓ టీనేజర్ ఈ నెల 24న తన తల్లిదండ్రులను రూ.1500 ఇవ్వాల్సిందిగా కోరాడు. అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో చున్నీని తల్లి మెడకు బిగించి.. ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అయితే అప్పటికీ ఆమె చనిపోయిందో లేదోనన్న అనుమానంతో తండ్రి గన్‌ తీసుకుని ఆమెను కాల్చి చంపాడు.

ఇంటికి తాళం వేసి పరార్..

ఇంటికి తాళం వేసి పరార్..


తల్లిని హత్య చేసిన తర్వాత తండ్రి వైపు గన్ గురిపెట్టాడు. అతని శరీరంలోకి రెండు బుల్లెట్లను కాల్చాడు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆపై ఇంట్లోకి వెళ్లి అతని తమ్ముడి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి అక్కడినుంచి పరారయ్యాడు.

లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు

లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు

సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల మూడు మృతదేహాలు పడి ఉండటాన్ని గుర్తించారు. ఇద్దరి శరీరాల్లో బుల్లెట్లు దిగినట్టు నిర్దారించారు. మరొకరిని గొంతు నులిమి హత్య చేసినట్టు నిర్దారించారు. ఇంట్లో ఒక లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 'దీనికి నేనే బాధ్యుడిని.. నేను చనిపోవడానికి వెళ్తున్నా.. నాకోసం వెతక్కండి..' అని రాసిపెట్టినట్టు గుర్తించారు.

సిమ్ కార్డు కొంటుండగా పట్టుకున్నారు..

సిమ్ కార్డు కొంటుండగా పట్టుకున్నారు..

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మాక్రొనియాలోని ఓ షాప్ వద్ద సిమ్ కార్డు కొంటుండగా అతన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడికి ప్రస్తుతం 17 ఏళ్లు అని.. అయితే అతను మేజర్ కావడానికి ఇంకా 7 నెలల సమయమే ఉందని ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+