రోడ్డుపై చెత్త పడేయ్యద్దంటే కత్తితో దాడి .. ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
యవత్మల్ : మనం నడిచే రోడ్డుపై చెత్త పడేయ్యద్దంటే అతగాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఒకరు మృతిచెందగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. మహారాష్ట్రలోని ఓ కుగ్రామంలో జరిగిన ఈ ఘటనతో ఊరిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులను మొహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ప్రశ్నిస్తే దాడి ..
యవత్మల్ జిల్లా మహాగాన్ గ్రామానికి చెందిన ఓంకార్ అలియాస్ రిషాబ్ నార్వాడే ఉంటున్నారు. అతని స్నేహితుడు మనోజ్ భార్వాడే ఇతరులు తమ తమ పనిచేసుకుంటూ ఉన్నారు. అయితే గ్రామంలో స్వచ్చ భారత్ కానీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. అయితే అదే వారి పాలిట శాఫమైంది. గ్రామానికి చెందిన గజానన్ రాథోడ్ కాస్త కటువైన వ్యక్తి. తన పని తాను చేసుకునే స్వభావం ఇతనిది. అయితే ఎవరైనా ఇతని గురించి వేలెత్తి మాట్లాడితే మాత్రం భౌతిక దాడి చేసేందుకు ఏ మాత్రం వెనుకాడడు.

చెత్త పడేయడంతో ..
ఇటీవల గజానన్ పొలం పనులకు వెళ్తూ .. చెత్తను రోడ్డుపై పడేశాడు. అయితే ఇది చూసిన ఓంకార్, అతని స్నేహితుడు మనోజ్ అభ్యంతరం తెలిపారు. వెంటనే పరిశుభ్ర పరుచాలని కోరారు. ఈ అంశంపై వారి మధ్య మాటలయుద్ధం జరిగింది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న గజానన్ .. తన వద్ద ఉన్న పదునైన కత్తి తీశాడు. అంతే ఓంకార్‌పై విచక్షణరహితంగా దాడి చేశాడు. తర్వాత అతని స్నేహితుడ మనోజ్‌పై కూడా విరుచుకుపడ్డాడు. అయితే తీవ్రగాయాలైన ఓంకార్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మనోజ్ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. మరోవైపు ఓంకార్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి .. నిందితుడి కోసం గాలించారు. గంటల్లోనే గజానన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications