ఎఫైర్: భార్య, కూతురు హత్య, రక్తపు కత్తితో పిఎస్‌కు..

Man kills wife and daughter, enters police station with bloodied knife
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను, కూతరును దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత హత్య చేసిన కత్తిని పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సోమవారం సాయంత్రం జరిగిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

తాను మొదట తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు. తాను జైలు కెళితే ఎవరు చూసుకుంటారని ఆ తర్వాత పొలియో కాలుతో బాధపడుతున్న తన కూతుర్ని కూడా కత్తి పొడిచి హత్య చేసినట్లు పోలీసుల ముందు నిందితుడు కుమార్ నాయక్ ఒప్పుకున్నాడు.

మంజులతో తనకు పదేళ్ల క్రితం వివాహం జరిగిందని నాయక్ తెలిపాడు. పెళ్లయిన రోజు నుంచి ఆమె ప్రవర్తన సరిగా లేదని చెప్పాడు. పెళ్లయిన కొన్ని రోజుల వరకు తన స్వస్థలం మగాది తలూకలోని మునసెకొప్పలో ఉన్నట్లు తెలిపాడు. అయితే అక్కడ భార్య వివాహేతర సంబంధాల గురించి వస్తున్న వార్తలు వినలేక 2009లో తమ కాపురాన్ని బెంగళూరుకు మార్చినట్లు చెప్పాడు. ఇక్కడ కూడా మంజుల తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించడంతోనే తాను ఆమెను హత్య చేసినట్లు తెలిపాడు.

కాగా, రాజాజీనగర్‌లోని 4వ బ్లాక్‌లోని నిందితుడి ఇంట్లో పోలీసులు మృతదేహాలను గుర్తించారు. నిందితుడి భార్య మంజుల(26), అతని కూతురు హర్షిత(6)లు రక్తపు మడుగులో పడివున్నారు. కూరగాయలు కోసే కత్తితో తన భార్య, కూతురు గొంతుకోసి హత్య చేసినట్లు నిందితుడు కుమార్ నాయక్ చెప్పాడు. వీరిని హత్య చేయాలని ముందే ప్రణాళిక వేసుకున్న నిందితుడు, అతని కుమారుడు చందన్(3)ను తమ బంధువుల ఇంట్లో విడిచి పెట్టివచ్చాడని పోలీసులు తెలిపారు. కాగా, ఎంతో సౌమ్యుడుగా ఉండే నాయక్.. భార్య, కూతురును హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నామని స్థానికులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+