భార్యను చంపేసి ముక్కలు చేసి ఊరంతా చల్లాడు
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో ఓ వ్యక్తి అత్యంత బీభత్సకరమైన చర్యకు ఒడిగట్టాడు. రాజస్థాన్‌లో ఆల్వార్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని దఫాలు దఫాలుగా ఊరంతా చల్లుతూ వచ్చాడు. ఈ సంఘటన కొన్ని రోజుల పాటు నగరవాసులకు కంటికి నిద్ర లేకుండా చేసింది. అయితే, మిస్టరీ ఎట్టకేలకు వీడి ఊపిరి పీల్చుకున్నారు.
దీపావళి రోజు నుంచి ఆల్వార్ నగరంలోని పలు కాలనీల్లో మహిళ శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా , కాలిపోయిన స్థితిలో ప్లాస్టిక్ బ్యాగుల్లో కనిపిస్తూ వచ్చాయి. దీంతో నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నాలుగు రోజుల్లో పోలీసులకు ఇలా ఏడు శరీర భాగాలు పోలీసులకు కనిపించాయి.
అన్నింటిలోనూ పోలీసులు ఓ సాధారణ అంశాన్ని కనిపెట్టారు. వాటిని ముక్కలు ముక్కలుగా చేసి, కాల్చేసి, తర్వాత బాగుల్లో కుక్కారు. అక్టోబర్ 30వ తేదీ దీపావళి రోజున ఆల్వార్ నగరంలోని ఆర్యనగర్ ప్రాంతంలో మహిళ కుడిపాదం ప్లాస్టిక్ బ్యాగులో కనిపించింది.

ఆ తర్వాతి రోజు రెండు చేతులు రెండు వేర్వేరు బ్యాగుల్లో కనిపించాయి. ఏడో రోజున చివరగా మహిళ తల మరో బ్యాగులో మరో కాలనీలో కనిపించింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే హంతకుడు కూడా నివసిస్తూ ఉండాలని పోలీసులు అనుమానించారు. దాంతో ప్రతి ఇంటీనీ గాలించారు. ఎట్టకేలకు యోగేష్ మల్హోత్రా అనే వ్యక్తిని అనుమానితుడిగా భావించారు.
దీపావళి రోజు నుంచి అతని భార్య కనిపించడం లేదని ఆ రోజు వాళ్ల ఇంట్లో ఏదో గొడవ జరిగిందని, అప్పటి నుంచి అతని భార్య కీర్తి ఆచూకీ లేకుండాపోయిందని ఇరుగుపొరుగువారు చెప్పినట్లు ఆల్వార్ ఎస్పీ రాహుల్ ప్రకాష్ తెలిపారు. గత కొద్ది రోజులుగా ఇంట్లోంచి అతను ఏవో సంచులు తీసుకుని వెళ్తున్నాడని కూడా చుట్టుపక్కలవారు చెప్పారు.
దాంతో వెంటనే యోగేష్ మల్హోత్రా మీద నిఘా పెట్టారు. అతడి చేతుల మీద కాలిన గుర్తులున్నాయి. పోలీసులు గాలిస్తున్న క్రమంలో అతను ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. చివరకు హిస్సార్‌లో తలదాచుకున్న అతన్ని అరెస్టు చేశారు.
తన భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసింది తానే గానీ, తాను చంపలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని అతను పోలీసులకు చెప్పాడు. తనకు ఏదైనా అయితే తన కూతుర్ని ఎవరు చూసుకుంటారనే భయంతోనే శరీరాన్ని ముక్కలు చేసి పారేయాలని అనుకున్నట్లు చెప్పాడు అయితే, పోలీసులు ఆ వాదనను నమ్మడం లేదు. ఆర్తికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించి అతను హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications