దారుణం: కూరలో టమాటాలు లేవని భార్యను చంపాడు!

Man kills wife for not putting tomato in vegetable dish
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన భార్య వండించిన ఓ వెజిటేబుల్ డిష్‌లో టమాటా లేదని ఓ భర్త ఆమెను చంపిన హతమార్చాడు. క్షణికావేశంలో ఆమె ప్రాణం తీశాడు. ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ సమీప గ్రామం లాక్మన్‌లో ఈ దారుణ ఘటన జరిగింది.

వాచ్‌మన్‌గా పని చేసే సదరు భర్త భోజనానికి ఉపక్రమించగా భార్య తాను వండిన కూర తెచ్చి వడ్డించింది. అయితే, అందులో టమాటోలు లేకపోవడం గమనించిన ఆ భర్త ఆమె తలను గోడకేసి బలంగా కొట్టాడు. దీంతో, ఆమె ప్రాణాలు విడిచింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేశారు.

సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సదరు భర్త తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కూరలో టమాటాలు వేయలేదని భార్య తలను గోడకేసి కొట్టాడని, దాంతో ఆమె చనిపోయిందని పోలీసులు చెప్పారు. భర్త పైన హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మృతురాలి వయస్సు ముప్పై సంవత్సరాలు ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+