కోరి వచ్చిన భార్యను మిత్రుడితో రేప్ చేయించాడు

జైపూర్: తన మిత్రుడితో తన భార్యపై అత్యాచారం చేయించిన వ్యక్తి ఘటన రాజస్థాన్‌లో జరిగింది. పందెంలో ఓడిపోవడంతో ఆ వ్యక్తి తన మాజీ భార్యను తన స్నేహితుడితో రేప్ చేయించాడు. తననే మళ్ళీ భర్తగా కోరి వచ్చిన మాజీ భార్యను నిఖా హలాలా పేరిట ఆ స్నేహితుడితోనే అత్యాచారం చేయించాడు.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇస్లాంలో వివాహ సంప్రదాయాల ప్రకారం మొదటి భర్తతో ఒకసారి విడాకులైన తర్వాత తిరిగి అతనితో మళ్లీ కలిసుండాలంటే ఆమె ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉండాలి.

ఈ రెండో భర్త మరణించినా లేదా ఆమె ఇతనితో కూడా విడాకులు పొందిన తర్వాతే మొదటి భర్తను మళ్ళీ పెళ్ళాడవచ్చు. ఇదే నిఖా హలాలా. ఈ సంప్రదాయాన్నే సాకుగా చూపించి ఆ భర్త నీచానికి దిగజారాడు. తనను కోరి మళ్లీ తిరిగొచ్చిన మాజీ భార్యకు మత్తు బిళ్లలిచ్చి స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. మత్తులో ఉన్న ఆమెను ఆ భర్త స్నేహితుడు అత్యాచారం చేశాడు.

Man loses wife in a bet, forces her to sleep with friend on pretext of halala

తాను స్పృహలోకి వచ్చేసరికి తాను మంచంపై నగ్నంగా ఉండటం చూసుకుని ఆ మహిళ బిక్కచచ్చిపోయింది. పోలీసులకు చెప్తే రేప్ వీడియోను నెట్‌లో పెడతామని భర్త, అతని స్నేహితుడు బెదిరించారు. ఆమె వయసు 45 సంవత్సరాలు. భర్త వయసు 50 సంవత్సరాలు.

మనస్పర్థల కారణంగా 8 నెలల క్రితం విడిపోయారు. తిరిగి తనను వెతుక్కుంటూ వచ్చిన భార్యను పందెంలో ఓడిపోయినందుకు ప్రతిఫలంగా స్నేహితుడి పడక గదిలోకి పంపాడు ఈ ప్రబుద్ధుడు. తనకు జరిగిన అన్యాయంపై బాధిత మహిళ పోలీసులుకు, ముస్లిం పౌర హక్కుల వేదికకు ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+