సోదరుడితో కలిసి భార్యను చంపేశాడు: స్థానికులు వెంటాడి భర్తను కొట్టి చంపేశారు !
సోదరుడితో కలసి భార్యను హత్య చేసిన భర్త. భర్తను వెంటాడి పట్టుకుని కొట్టి చంపేసిన స్థానికులు. గతంలో భావ, ఇప్పుడు భార్యను హత్య చేశాడు. చివరికి ఇలా చచ్చాడు.
రాంచీ: భార్యను హత్య చేసి పారిపోతున్న భర్తను పట్టుకున్న స్థానికులు అతన్ని దారుణంగా కొట్టి చంపేసిన ఘటన జార్ఖండ్ లో జరిగింది. జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ జిల్లాలోని జామ్ నగర్ ప్రాంతంలో అసాదుల్లా అనే వ్యక్తి స్థానికుల చేతిలో హత్యకు గురైనాడు.
ఆదివారం అసాదుల్లా తన సోదరుడితో కలిసి అతని భార్య షల్లి బీబీని కత్తులతో పోడిచి హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అసాదుల్లా తరువాత సోదరుడితో కలిసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. విషయం గుర్తించిన స్థానికులు అసాదుల్లా, అతని సోదరుడిని వెంబడించారు.

చివరికి స్థానికులు అసాదుల్లాను పట్టుకున్నారు. అతని సోదరుడు మాత్రం తప్పించుకుని పారిపోయాడు. భార్యను హత్య చేసిన అసాదుల్లాను స్థానికులు ఇష్టం వచ్చినట్లు కొట్డడంతో తీవ్రగాయాలైన అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మరణించాడని స్థానిక పోలీసులు తెలిపారు.
2015 జులై 28వ తేదీ అసాదుల్లా అతని సోదరుడితో కలసి తన భార్య షల్లిబీబీ సోదరుడు సద్దాంను హత్య చేశారు. షల్లిబీబీని అసాదుల్లా వివాహం చేసుకోవడం సద్దాంకు ఇష్టం లేకపోవడంతో అప్పట్లో అతన్ని హత్య చేశారు. సద్దాం హత్య కేసులో అసాదుల్లా జైలుకు వెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చిన అసాదుల్లా కేసు రాజీ చెయ్యలాని భార్య షల్లిబీబీకి చెప్పాడు. కేసు రాజీ చెయ్యడానికి భార్య షల్లిబీబీ నిరాకరించడంతో ఆమెను హత్య చేశాడని, చివరికి స్థానికుల చేతిలో అసాదుల్లా అంతం అయ్యాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications