రైలు కదులుతుండగా ఎక్కబోయి.. పట్టాలపై జారిపడి.. ప్రాణాలతో బయటపడి (వీడియో)
భువనేశ్వర్ : అదృష్టం ఎప్పుడు ఎలా కలిసివస్తుందో చెప్పలేం. ఒకోసారి మృత్యు ఒడికి చేరి ప్రాణాలు దక్కించుకున్న అదృష్టవంతులు కూడా ఉంటారు. అదే కోవలో ఓ ప్రయాణికుడు రైలు ఎక్కబోతూ పట్టాలపై జారిపడ్డా కూడా ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది.
#WATCH: A man survives after he fell on the tracks through the gap between the platform and the train at the Jharsuguda railway station while trying to board a moving train. (18-06) #Odisha pic.twitter.com/sz9wIYDN0z
— ANI (@ANI) June 20, 2019
ఒడిషాలోని ఝర్సుగూడ రైల్వే స్టేషన్‌లో మంగళవారం అనుకోని ఘటన జరిగింది. రాజేశ్ తల్వార్ అనే యువకుడు హవ్‌రా నుంచి సాంబల్‌పూర్‌కు రైలులో ప్రయాణిస్తున్నాడు. అయితే ఝర్సుగూడ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఆగినప్పుడు ఛాయ్ కోసమని కిందకు దిగాడు. ఆ క్రమంలో టీ తాగి వచ్చేంతలోపు రైలు కదిలింది.

దాంతో ఆ రైలును క్యాచ్ చేసే క్రమంలో రాజేశ్ జారిపడి పట్టాలపై పడ్డాడు. వెంటనే అలర్టైన రైల్వే పోలీసులు ట్రైన్‌ను నిలిపివేశారు. పట్టాలపై పడ్డ రాజేశ్‌ను నెమ్మదిగా బయటకు తీసుకొచ్చారు. అయితే స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ప్రాణపాయం తప్పడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications