రూ. 30 వేలకు భార్యను తాకట్టు పెట్టాడు: హత్య
చండీగడ్: అవసరాల కోసం స్నేహితుడి దగ్గర రూ. 30 వేలు రుణం తీసుకుని అందుకు బదులుగా అతని భార్యను తాకట్టుపెట్టేశాడు ఓ వ్యాపారి. అప్పు ఇచ్చిన వ్యక్తి స్నేహితుడి భార్యను విహారయాత్రలకు తీసుకు వెళ్లి ఆమెతో సహజీవనం చేస్తూ ఎంజాయ్ చేశాడు.
చివరికి రుణం తీసుకున్న స్నేహితుడి చేతిలోనే అతనూ హత్యకు గురైనాడు. మహమ్మద్ గులామ్ (35) అనే వ్యాపారి స్నేహితుడి చేతిలో హత్యకు గురైనాడని యమునా నగర్ పోలీసులు చెప్పారు. బీహార్ లోని ఆరియా జిల్లాకు చెందిన గులామ్ మూడేళ్ల క్రితం యమునా నగర్ చేరుకుని పత్తి ప్రాససింగ్ వ్యాపారం చేస్తున్నాడు.
బీహార్ కు చెందిన సబీర్, సల్మా దంపతులు యమునా నగర్ చేరుకుని చిన్న హోటల్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్ననారు. అదే విదంగా సబీర్ దినసరి కూలీలను కాంట్రాక్టర్లకు సరఫరా చేస్తుంటాడు. గులామ్ వీరి హోటల్ కు వెళ్లి బోజనం చేస్తుంటాడు.

ఈ విదంగా వీరు చాల దగ్గర అయ్యారు. గత జనవరి నెలలో సబీర్ రూ. 30 వేలు అప్పు కావాలని గులామ్ కు చెప్పాడు. గులామ్ నగదు ఇవ్వడానికి అంగీకరించాడు. రూ. 30 వేలు రుణం తీసుకున్నందుకు సెక్యూరిటిగా తన భార్య సల్మాను గులామ్ దగ్గర తాకట్టు పెట్టాడు.
గులామ్ సల్మాను పిలుచుకుని వెళ్లి యమునానగర్ సమీపంలోని జగధారి నగరలోని ఇంటిలో పెట్టాడు. గత మార్చి నెలలో గులామ్ స్నేహితుడి భార్య సల్మాను పిలుచుకుని బీహార్, హిమాచల్ ప్రదేశ్ తదితర చోట్ల విహార యాత్రలు చేస్తూ సహజీవనం చేశారు.
అక్టోబర్ చివరి వారంలో వ్యాపారం సీజన్ మొదలు కావడంతో గులామ్ సల్మాను పిలుచుకుని యమునా నగర్ కు తిరిగి వెళ్లాడు. తరువాత గులామ్ దారుణ హత్యకు గురైనాడు. రెండు వారాల తరువాత పోలీసులు గులామ్ మృతదేహాన్ని గుర్తించి దర్యాప్తు చేశారు.
విచారణలో సబీర్, సల్మా విషయం బయటపడింది. తాను తీసుకున్న రూ. 30 వేలు రుణం తిరిగి చెల్లించినా తన భార్య సల్మాను అప్పగించలేదని, వడ్డికింద రూ. 20 ఇవ్వాలని గులామ్ డిమాండ్ చేశాడని సబీర్ పోలీసులకు చెప్పాడు.
మొత్తం రూ. 50 వేలు చెల్లించినా తన భార్యను వదిలి పెట్టకుండా వేదించాడని, అందుకే హత్య చేశానని సబీర్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. గులామ్ ను హత్య చెయ్యడానికి సబీర్ కు అతని స్నేహితులు సహకరించి ఉంటారని యమునా నగర్ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications