సినిమాలో పోలీస్: 9ఏళ్ల క్రితం నేరంపై సెట్లో అరెస్ట్

తిరువనంతపురం: ఓ సినిమాలో పోలీసు పాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తి సినిమా షూటింగ్ సెట్‌లోనే అరెస్టయిన సంఘటన కేరళలో జరిగింది. అరెస్టైన మలయాళీ సినిమాలో పోలీసు పాత్ర వేస్తున్నాడు. అతను వేధింపుల కేసులో ముఖ్య నిందితుడు.

అంతేకాదు, అతను గత తొమ్మిదేళ్లుగా పరారీలో ఉన్నాడు. కేసులో నిందితుడిగా ఉండి సినిమాలో పోలీస్‌ పాత్రలో నటిస్తున్న అతనిని గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. సంతోష్ అనే వ్యక్తి ఓ పదిహేనేళ్ల యువకుడిపై వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు.

Man Playing Cop's Role in a Movie, Arrested From Set

2006లో ఇతను ఆ యువకుడిపై ఇనుప రాడ్డు, కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దాడికి పాల్పడిన సంతోష్ తొమ్మిది ఏళ్ల నుంచి పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్నాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఓ ఉద్యోగం సంపాదించిన సంతోష్ జూనియర్ ఆర్టిస్టుగా ఉంటున్నాడు.

పలు సినిమాల్లో నటిస్తున్నాడు. మలయాళ సినిమాలో నటిస్తున్న సంతోష్‌ను గుర్తించిన పోలీసులు సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్‌లోనే అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అతనితో పాటు మిగతా నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+