వివాహేతర సంబంధం: ప్రియురాలి భర్త హత్యకు యత్నం, అరెస్ట్
న్యూఢిల్లీ: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వ్యక్తి, తన ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అది విఫలం కావడంతో పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. రిక్షాల వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి(37)కి అతనికంటే రెండేళ్లు చిన్నదైన ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో వీరిద్దరూ తరచూ కలుసుకునేవారు.
అయితే ఈ వ్యవహారం మహిళ భర్తకు తెలిసిపోయింది. దీంతో అతడు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను మళ్లీ ఎప్పుడూ అతడ్ని కలవనని ఆమె తన భర్తకు హామి ఇచ్చింది.

కాగా, కొంత కాలం వేచి చూసిన ప్రియుడు ఆమెను కలుసుకునేందుకు ప్రయత్నించాడు. వివాహిత తన భర్తతో జరిగిన విషయాన్ని చెప్పడంతో అతడ్ని ఎలాగైన మట్టుపెట్టాలని కుట్ర పన్నాడు ప్రియుడు. ఇందుకోసం అస్లాం అనే వ్యక్తిని పురమాయించాడు. అతనికి రూ. 10వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని, ముందుగా రూ. 5వేలు అతనికి ఇచ్చాడు.
దీంతో అస్లాం సదరు మహిళ భర్త కోసం అతని కార్యాలయం వద్ద కాపు కాసాడు. అతడు బయటికి రాగానే తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే బుల్లెట్ అతనికి చేయి తగిలికిందపడిపోయాడు. దీంతో నిందితుడు అక్కడ్నుంచి పారిపోయాడు.
స్థానికులు బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అస్లాంతోపాటు ప్రధాన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు తానే హత్యకు కుట్ర పన్నినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications