• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కామాంధుడి ఖాకీ వేషం-అమ్మాయిలతో పరిచయాల కోసం నకిలీ పోలీస్ అవతారం -హోటల్‌కు తీసుకెళ్లి రేప్

|

టీనేజ్ నుంచే అతని తిక్క వేషాలు చేసిన తల్లిదండ్రులు.. పాతికేళ్లలోపే పెళ్లి కూడా చేసేశారు. భార్యతో కొన్నాళ్ల కాపురానికి గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. కానీ అతనిలో కామవాంఛలు ఇంకా తీరలేదు. నైస్ గా మాట్లాడి అమ్మాయిలను తన వశం చేసుకోవడం అతని స్టైల్. అందు కోసం ఏకంగా ఖాకీ దుస్తుల్లోకి మారిపోయాడు. పోలీస్ అధికారినని బిల్డప్ ఇస్తూ అత్యాచారాలకు పాల్పడుతోన్న కామాంధుడిని అసలైన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో కలకలం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

జగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామ

ఆఫీసర్‌గా బిల్డప్ ఇచ్చి..

ఆఫీసర్‌గా బిల్డప్ ఇచ్చి..

పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నానని చెప్పి పలువురు మహిళలను లోబరుచుకుని, వారిపై లైంగిక దాడి చేస్తున్న కామాంధుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసారు. నాలుగు నెలల కిందట జరిగిన ఓ సంఘటనలో బాధితురాలి ఫిర్యాదుతో మొత్తం గుట్టు రట్టయింది. సెప్టెంబర్ 6న ఢిల్లీలోని పహర్ గంజ్ లో గల ఓ హోటల్ లో ఒక మహిళపై ఉత్తర ప్రదేశ్ కు చెందిన పోలీసు అధికారి లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు పోలీసు స్టేషన్ కి ఫోన్ వచ్చింది. పోలీసులు ఘటనా స్ధలానికి వెళ్ళగా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు..

అర్నాబ్ గోస్వామికి భారీ షాక్ -రిపబ్లిక్ టీవీలో విద్వేష ప్రచారం -జరిమానా విధింపు, వార్నింగ్

ముప్పుతిప్పలు..

ముప్పుతిప్పలు..

పహార్ గంజ్ హోటల్ లో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కానీ నిందితుడి ఆనవాళ్లు ఎవరూ చెప్పలేక పోయారు. హోటల్ రూం బుక్ చేసుకోటానికి పోలీసు అధికారినని చూపించిన గుర్తింపుకార్డు నకిలీది కావడం, మొబైల్ ఫోన్ నంబర్లకు ఇచ్చిన చిరునామాలు కూడా తప్పుడువేనని తేలడంతో అతణ్ని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. బాధితురాలు చెప్పిన ఆనవాళ్లతో నిందితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు రూపోందించారు. అనేక చోట్ల సీసీటీపీ ఫుటేజీలు పరిశీలించినా నిందితుడి ఆనవాళ్లు కనిపెట్టలేకపోయారు. ఇన్పార్మర్లను పోలీసులు అలర్ట్ చేశారు. చివరికి..

బార్ సిబ్బంది సహకారంతో..

బార్ సిబ్బంది సహకారంతో..

చివరికి ఒక బార్ లోని కొందరు పనివారు ఆ కామాంధుణ్ని గుర్తుపట్టారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్, మీరట్ జిల్లా బహుదూర్ ఘర్ గ్రామానికి చెందిన సందీప్ కుమార్ (28)గా పోలీసులు గుర్తించారు. నిందితుడు మహిళలతో పరిచయం పెంచుకోటానికి బార్లు, పబ్ లకు ఎక్కువగా వెళ్లేవాడని, పబ్ లకు పలువురు మహిళలతో వెళ్లినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. బార్ లోని సిబ్బంది సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సెంట్రల్ ఢిల్లీ డీసీపీ సంజయ్ భాటియా చెప్పారు.

English summary
A 28-year-old man posing as an Uttar Pradesh Police officer was arrested for allegedly raping a woman at a hotel in central Delhi's Paharganj area after luring her, police said. The accused, Sandeep Kumar, is a resident of Meerut, Uttar Pradesh, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X