అల్లుడురూప రాక్షసుడు:అత్త నోట్లో యాసిడ్ పోసి, ప్రజలపై పోసే యత్నం, రాళ్లతో దాడితో..
ఏం జరిగిందో తెలియదు, గొడవకు కాల కారణంపై పూర్తి క్లారిటీ లేదు. కానీ ఆ అల్లుడు రెచ్చిపోయాడు. తన అత్తపై ఘాతుకానికి పాల్పడ్డాడు. మంచి, మర్యాద, జాలి, దయ చూపించలేదు. అత్త నోట్లో యాసిడ్ పోసి కలకలం సృష్టించాడు. తమిళనాడులోని గురుసామిపలయాలో జరిగిన ఘటన ఆందోళనకు గురిచేస్తోంది.

రెండో భర్త..
తమిళనాడులోని నమక్కల్ జిల్లా గురుసామీపలయా గ్రామానికి చెందిన ధనమ్మాల్ (75) తమ కుటుంబంతో ఉంటున్నారు. ఆమె కూతురు వాసంతికి వివాహమైంది.. కానీ భర్త చనిపోవడంతో ధర్మపురికి చెందిన సామ్యుల్‌ను రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే వాసంతికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. వారు అమ్మమ్మ ధనమ్మాల్‌తో ఉండేవారు. వాసంతి, సామ్యుల్ కాపురం సావ్యంగా సాగుతుంది. పిల్లల గురించి వీరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది.

అర్ధరాత్రి అలజడి
శుక్రవారం అర్ధరాత్రి ధనమ్మాల్ ఇంటికి సామ్యుల్ వచ్చాడు. తనతో పిల్లలను పంపించమని అడిగాడు. వారంతా 18 నుంచి 24 ఏళ్లు ఉన్న ముగ్గురు యువతులు కావడం. వారిని పంపితే ఏం చేస్తాడనే భయంతో వద్దని వారించింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. నేరప్రవృత్తి కలిగిన సామ్యూల్ అప్పటికే తనతో యాసిడ్, కొడవలి తీసుకొచ్చాడు. అత్త, అల్లుళ్ల మధ్య గొడవ జరుగుతుండటంతో ఇరుగుపొరుగు వారు కూడా గుమికూడారు.

నోట్ల యాసిడ్ పోసి
మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరడంతో సామ్యూల్ సహనం కోల్పోయాడు. అప్పటికే తనతో తీసుకొచ్చిన యాసిడ్ బాటిల్ తీసి ఆమె నోట్లో పోశారు. అదసలే యాసిడ్.. నోట్లోకి వెళ్లడంతో పేగులు మాడిపోయి.. వృద్ధురాలు అక్కడికక్కడే చనిపోయారు. తనతో తీసుకొచ్చిన ఇంకో బాటిల్ యాసిడ్ ఇరుగు పొరుగు వారిపై పోయాలని చూశాడు. అప్పటికే పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు. పోలీసులు రంగప్రవేశం చేసిన లాభం లేకపోయింది. సామ్యూల్‌ను పట్టుకోలేకపోయారు.

బండరాళ్లతో దాడి
ఇంతలో బాటిల్‌తో బెదిరించడంతో స్థానికులు బండరాళ్లతో దాడిచేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి సామ్యూల్ స్పృహ కోల్పోయాడు. అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయాడని పోలీసులు తెలిపారు. ధనమ్మాల్, సామ్యూల్ మృతదేహాలను రాసిపురం ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టంలో ఉంచారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. విచారణలో నేరం జరగడానికి ప్రధాన కారణం బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications