సెల్ఫీ దిగుతుండగా.. భార్యను కెనాల్ లోకి తోసి..
మీరట్ : అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తోన్న ఓ భర్త, ఒక కెనాల్ పక్కన నిలబడి తన భార్య సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఆమెను అందులోకీ తోసేసి చంపేశాడు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కి సమీపంలో ఉన్న సర్ధానా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. అయేషా (24) అనే ఒక వివాహితను భర్త ఆఫ్తాబ్ (30) గంగానదిలోకి తోసి చంపేశాడు. అంతా జరిగాక ఏమి ఎరుగనట్టు తన 8 ఏళ్ల కొడుకును తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్లిన ఆఫ్తాబ్ ఐదుగురు దుండగులు తమపై దాడి చేసి అయేషాను పక్కనే ఉన్న కెనాల్ లోకి తోసేశారని ఫిర్యాదు చేశాడు.

ఆఫ్తాబ్ చెప్పిన ఘటనా స్థలానికి వెళ్లి వివరాలను పరిశీలించిన పోలీసులకు ఆఫ్తాబ్ చెప్పిన విషయాలపై నమ్మకం కలగలేదు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో భాగంగా నిజం ఒప్పేసుకున్న ఆఫ్తాబ్, భార్య అయేషాను తానే కెనాల్ లోకి తోసి చంపేసినట్టుగా అంగీకరించాడు.
కాగా, అయేషా ఆఫ్తాబ్ జంటకు ఏడాదిన్నర క్రితం వివాహాం జరిగింది. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా, అదనపు కట్నం కోసమే ఆఫ్తాబ్ భార్యను హతమార్చినట్టుగా ప్రాథమిక సమాచారం. కట్నం వేధింపులతోనే అయేషాను హత్య చేసినట్టుగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications