ఘోరం : యువతిపై అత్యాచారం.. మర్మాంగంలో ఇనుపరాడ్డు..

మహిళా భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా కామాందుల మైండ్ సెట్ మాత్రం మారట్లేదు. నెల రోజుల క్రితం జరిగిన దిశ సంఘటనపై యావత్ దేశం చలించినా పరిస్థితిలో మార్పేమీ రాలేదు. దేశంలో ప్రతీరోజూ ఎక్కడో చోటా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాందుల కామానికి ఆడపిల్లలు బలైపోతూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. బాధిత యువతి(18) తన సోదరుడితో కలిసి గోందియా జిల్లాలోని పర్దిలో ఓ స్పిన్నింగ్ మిల్లులో కూలీగా పనిచేస్తోంది. స్థానికంగా ఓ అద్దె ఇంట్లో వీరు నివాసం ఉంటున్నారు. మిల్లులతో వీరితో పాటే పనిచేసే మరో మహిళ, సూపర్‌వైజర్ కూడా వీరికి దగ్గరలోనే నివాసం ఉంటున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 21న యువతి సోదరుడు తమ సొంత ఊరికి వెళ్లాడు. ఆ సమయంలో యువతి ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇదే అదనుగా భావించిన స్పిన్నింగ్ మిల్లు సూపర్‌వైజర్ ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.

 Man Rapes 19 year old and inserts rod in private parts in maharashtra

అయితే ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో నోట్లో గుడ్డలు కుక్కాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు స్పృహ కోల్పోయి కిందపడగా.. ఆ సమయంలో ఆమె మర్మాంగంలో ఐరన్ రాడ్డును గుచ్చాడు.ఈ నెల 24న ఆమె సోదరుడు ఊరి నుంచి తిరిగి రావడంతో.. అతనితో కలిసి వెళ్లి పర్ది పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+