వీడు తండ్రేనా : మూడేళ్ల కూతురిపై అత్యాచారం చేసిన దౌర్భాగ్యుడు

గుడ్గావ్ : కామాంధులు తెగబడుతున్నారు. కనీస విలువలను మరిచి ప్రవర్తిస్తున్నారు. వావివరసలను కాలరాస్తున్నారు. ఒళ్లంతా కామం నింపుకుని ఎవరిపై అత్యాచారానికి పాల్పడుతున్నారో కూడా తెలుసుకోకుండ పశువులా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే గుర్గావ్‌లో చోటుచేసుకుంది. సొంత తండ్రి మూడేళ్ల కూతురిపై పశువులా ప్రవర్తించాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. అక్టోబర్ 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఇక వివరాల్లోకి వెళితే... అక్టోబర్ 28న రాత్రి భార్యా భర్తలు గొడవ పడ్డారు. దీంతో ఆగ్రహం చెందిన భార్య తన ఏడాది కూతురిని తీసుకుని తన బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. మూడేళ్ల కూతురిని ఇంట్లోనే వదిలి వెళ్లిపోయింది. అయితే ఇదే సమయంలో తండ్రి పశువు అవతారమెత్తాడు. చిన్నారి అని కూడా చూడకుండా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ప్రపంచం అంటే ఏమిటో తెలియని పసిబిడ్డపై కామంతో పంజా విసిరాడు. అత్యాచారం చేశాడు. ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. మర్నాడు ఉదయం 10 గంటల ప్రాంతంలో భార్య తిరిగి ఇంటికి చేరుకుంది. తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్లగానే షాక్‌కు గురైంది.

 Man rapes 3-yr-old daughter after quarrel with wife, arrested

భర్త ఇంట్లో లేడు.. మూడేళ్ల తన కూతురు స్పృహ కోల్పోయి పడి ఉంది. బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు ఉండటం తల్లి గమనించింది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అమ్మాయిపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ఢిల్లీలోని సఫ్ధార్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరాతక భర్త కోసం గాలించారు. శుక్రవారం పోలీసులు ఈ కిరాతకుడిని పట్టుకుని అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+