కొడుకు గర్ల్ ఫ్రెండ్‌ని రేప్ చేసి.. పెళ్లికి పనికిరావు పొమ్మన్నాడు.. చివరికి ఊహించని ట్విస్ట్
డబ్బు మదం తలకెక్కిన ఆ వ్యాపారికి.. తన కొడుకు ఓ మామూలు అమ్మాయిని ఇష్టపడటం నచ్చలేదు.. ఎంత నచ్చచెప్పినా కొడుకు వినిపించుకోలేదు.. ఆ అమ్మాయే తన సర్వస్మమని.. ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లిచేసుకుంటామనీ కొడుకు తేల్చిచెప్పాడు.. ఎలాగైనాసరే పెళ్లిని చెడగొట్టాలనుకున్న ఆ తండ్రి.. ప్లాన్ చేసి మరీ కొడుకు గర్ల్‌ఫ్రెండ్‌ను రేప్ చేశాడు.. అచ్చం 'ఆమె' సినిమాను తలపించే ఈ సంఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో జరిగింది. గురువారం రాత్రి నిందితుడు నిత్యానందంను అరెస్టు చేసిన పోలీసులు.. కేసు వివరాల్ని మీడియాకు వెల్లడించారు.
అమ్మాయి ఫ్యామిలీ ఓకే..
నాగపట్నం జిల్లా వేదారణ్యం టౌన్లో గార్మెట్ షాప్ నిర్వహించే నిత్యానందం(42) చాలా మందికి సుపరిచితుడు. వ్యాపారం కలిసిరావడంతో ఆస్తులు కూడా పోగేశాడు. ఒక్కగానొక్క కొడుకు ముఖేశ్ కన్నన్ను మురిపెంగా పెంచుకున్నాడు. డిగ్రీ పూర్తిచేసి, వ్యాపారంలో తండ్రికి సాయంగా ఉంటోన్న కన్నన్‌కు కొన్ని నెలల కిందట ఓ అమ్మాయి(20) పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా సరేనన్నారు. కానీ నిత్యానందంకు మాత్రం కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడం అస్సలు నచ్చలేదు.
ముహుర్తాలు మాట్లాడుకుందాం రమ్మని..
ఆ అమ్మాయి మన తాహతుకు సరిపోదని, కావాలంటే ఇప్పటికిప్పుడు ఇంకో సంబంధం.. అదికూడా బాగా డబ్బున్న పిల్లతో పెళ్లి చేయిస్తానంటూ కొడుకు కన్నన్ను కన్విన్స్ చేయడానికి నిత్యానందం చాలా రకాలుగా ట్రైచేశాడు. కానీ ఆ యువకుడు మాత్రం గర్ల్‌ఫ్రెండ్‌నే చేసుకుంటానని పట్టుపట్టాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ పెళ్లి చెడగొట్టాలని డిసైడైన నిత్యానందం.. ఆ అమ్మాయికి ఫోన్ చేసి.. ముహుర్తాలు మాట్లాకుందాం రమ్మని కబురుపెట్టాడు. ఈ విషయం కొడుక్కి చెప్పొద్దని.. వాడిని సర్ప్రైజ్ చేద్దామని అమ్మాయిని ఒప్పించాడు.
బలవంతంగా తాళి కట్టి..
వేదారణ్యం శివారులో శెంబోదయ్ అనే ఊళ్లో నిత్యానందంకు ఓ ఫామ్ హౌస్ ఉంది. అక్కడికా అమ్మాయి రాగానే.. ముందుగా మొబైల్ ఫోన్ లాగేసుకున్నాడు. రెండు చేతులతో ఆమెను బంధించి బెడ్రూమ్లోకి లాక్కెళ్లి బలవంతంగా మెడలో తాళికట్టాడు. అంతటితో వదిలేయకుండా.. ‘ఇప్పుడెలా నా కొడుకును పెళ్లిచేసుకుంటావో చూస్తా'.. అని ఉన్మాదిలా అరుస్తూ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండ్రోజులపాటు ఆమెను అక్కడే బంధించి పదేపదే అఘాయిత్యం చేశాడు.
స్నేహితులతోనూ రేప్ చేయించాలని..
యువతి జీవితాన్ని సర్వనాశం చేయాలని డిసైడైన నిత్యానందం.. స్నేహితులతోనూ ఆ యువతిని రేప్ చేయించాలనుకున్నాడు. రెండ్రోజుల తర్వాత ఆమెను తీసుకెళ్లి ఓ స్నేహితుడి ఇంట్లో బంధించాడు. మూడ్రోజులుగా గర్ల్‌ఫ్రెండ్ కనిపించకుండా పోవడంతో కంగారుపడ్డ కన్నన్.. ఏం జరిగిందో కనిపెట్టే ప్రయత్నం చేశాడు. తన తండ్రే ఆ అమ్మాయిని బంధించాడని ఆలస్యంగా తెలుసుకున్నాడు.
రెస్క్యూ ఆపరేషన్..
కన్నన్ ఫిర్యాదు మేరకు వేదారణ్యం పోలీసులు.. శెంబోదయ్ ఫాంహౌజ్ లో బందీగా ఉన్న అమ్మాయిని రెస్క్యూ చేశాడు. ఇంకో పోలీస్ టీమ్ నిత్యానందంను వెదికిపట్టుకుంది. నిందితుడిపై కఠిన చట్టాలకిందట కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. తనను ప్రేమించిన పాపానికి తండ్రి ద్వారా అమ్మాయికి జరిగిన ఘోరానికి కన్నన్ కుమిలిపోలేదు. ఆమెనే పెళ్లిచేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు.