రెండు వారాలుగా కూతురిపై కన్నతండ్రి రేప్
ముంబై: రెండు వేర్వేరు సంఘటనలో ముంబైలోని మీరా రోడ్డుకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఓ బాలికను స్వయానా కన్నతండ్రే రేప్ చేయగా, మరో బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
కాశిమీరాలో గల ఇంటిలో వారం రోజులుగా 15 ఏళ్ల బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్య తన సొంత ఊరికి వెళ్లిన సమయంలో తండ్రి కూతురిపై ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారంనాడు వెలుగులోకి వచ్చింది. తన తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని అమ్మాయి కేకలు వేయడంతో ఆ సంఘటన వెలుగు చూసింది.
అమ్మాయి కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చి రక్షించారు. తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లైంగిక దాడి జరిగిందా, లేదా అని నిర్ధారించుకోవడానికి బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి పంపించారు.

కాగా, 17 ఏళ్ల బాలికపై పొరుగున ఉండే 22 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆదివారంనాడు కాశిమీరా ప్రాంతంలోనే జరిగింది. తల్లి, సోదరుడు బంధువుల ఇంటికి వెళ్లడంతో అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో యువకుడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి దిగాడు.
యువకుడు బాధితురాలిని బెదిరించి దారుణానికి ఒడిగట్టాడు. తల్లి వచ్చిన వెంటనే అమ్మాయి విషయం ఆమెకు చెప్పింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications