భార్యతో రెండో పెళ్లి, అక్కడే చెల్లెలి మెడలో మూడు ముళ్లు, సర్పంచ్ భార్యకు రెండో పెళ్లి !

భోపాల్: భార్యను రెండో పెళ్లి చేసుకున్న భర్త అదే కల్యాణమండపంలో భర్త చెల్లికి మూడు ముళ్లు వేశాడు. మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో భార్యతో పాటు ఆమె చెల్లిని వివాహం చేసుకున్న ముగ్గురు బిడ్డల తండ్రి తాను ఇద్దరితో లక్షణంగా కాపురం చేస్తానని, ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నాడు. అక్కా చెల్లిని వివాహం చేసుకున్న వ్యక్తి మొదటి భార్య సర్పంచ్ కావడం విశేషం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదని, మేము ఏమీ చెయ్యలేమని భింద్ జిల్లా ఎస్పీ రుడాల్ఫ్ అల్వారిస్ తెలిపారు.

దంపతుల కాపురం హ్యాపీ

దంపతుల కాపురం హ్యాపీ

మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలోని గుడావళి గ్రామంలో నివాసం ఉంటున్న దీపు పరిహార్ (35) అనే వ్యక్తి 9 ఏళ్ల క్రితం వినితా (28) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. దీపు పరిహార్, వినితా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాహం అయిన తరువాత దీపు పరిహార్, వినితా దంపతులు చాల సంతోషంగా ఉన్నారు.

భార్య సర్పంచ్

భార్య సర్పంచ్

గుడావళి గ్రామంలో జరిగిన ఎన్నికల్లో దీపు పరిహార్ భార్య వినిత సర్పంచ్ గా ఎన్నిక అయ్యింది. రాజకీయాల్లోకి వచ్చినా వినితా కుటుంబ సభ్యులతో ఎప్పటిలాగే అన్యోన్యంగా ఉండేది. అయితే వినితా తీవ్ర అనారోగ్యానికి గురైయ్యింది. పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికి కొంత కాలంగా వినితా చాల ఇబ్బందులు ఎదుర్కొనింది.

రెండో పెళ్లి చేసుకోవాలని !

రెండో పెళ్లి చేసుకోవాలని !

తీవ్ర అనారోగ్యానికి గురైన వినితా తాను ఇక పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం తనకు సాధ్యం కావడంలేదని, నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలని భర్త దీపు పరిహార్ కు చెప్పింది. అయితే వేరే మహిళను వివాహం చేసుకుంటే మన పిల్లలను బాగా చూసుకోదని, లేనిపోని సమస్యలు వస్తాయని కొంత కాలంగా దీపు పరిహార్ భార్య వినితాకు చెబుతూ వచ్చాడు.

అక్క మొగుడితో పెళ్లి

అక్క మొగుడితో పెళ్లి

వినితాకు రచనా (22) అనే చెల్లలు ఉంది. వేరే మహిళను రెండో పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయని చెప్పిన భర్త దీపు పరిహార్ కు తన చెల్లెలు రచనాను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీపు పరిహార్ కు రచనాను ఇచ్చి రెండోపెళ్లి చెయ్యడానికి వినితా కుటుంబ సభ్యులు అంగీకరించారు.

ఒకే ఇంటిలో అక్కాచెల్లితో కాపురం

ఒకే ఇంటిలో అక్కాచెల్లితో కాపురం

పెద్దలు అందరూ అంగీకరించడంతో దీపు పరిహార్ రచనాను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. అయితే మొదట తన భార్య వినితాను మరోసారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. అంతే కల్యాణ మండపంలో బార్య వినితాకు మొదట రెండో సారి తాళి కట్టిన దీపు పరిహార్ అదే ముహూర్తానికి ఆమె చెల్లెలు రచనా మెడలో మూడు ముళ్లు వేశాడు. అక్కాచెల్లిని పెళ్లి చేసుకున్న దీపు పరిహార్ ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని అంటున్నాడు. అయితే హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వం నేరం అయినా తమకు ఎలాటి ఫిర్యాదు రాలేదని, ఇప్పుడు మేము ఏమీ చెయ్యలేమని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద సర్పంచ్ మొగుడు ఒకే ముహూర్తంలో భార్యకు, ఆమె చెల్లికి ఒకే ముహుర్తానికి తాళి కట్టి ఇప్పుడు వార్తల్లో నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+