షాక్: పదేపదే మహిళను తాకరాని చోట తాకి, ఇష్టం లేదా?
విమానంలో తన పక్క సీటుల్లో కూర్చొన్న మహిళపై ఓ ప్రబుద్దుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను పదేపదే అసభ్యంగా తాకాడు. బాధితురాలు ఎయిర్ హోస్టెస్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
న్యూఢిల్లీ: విమానంలో తన పక్క సీటుల్లో కూర్చొన్న మహిళపై ఓ ప్రబుద్దుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను పదేపదే అసభ్యంగా తాకాడు. బాధితురాలు ఎయిర్ హోస్టెస్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
ఇక గత్యంతరం లేక ఆమె సీటును మార్చింపించుకొంది. సీటు మార్చుకొని వెళ్లిపోతోంటే కూడ ఆ వ్యక్తి తన వెకిలిబుద్ది ప్రదర్శించాడు. నేను తాకడం నీరకు నచ్చడం లేదా అంటూ తన వెకిలిబుద్దిని ప్రదర్శించాడు.

ఈ ఘటన షాకింగ్ ఘటన ఢిల్లీ నుండి ముంబై వెళ్లే విమానంలో చోటుచేసుకొంది. విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
లాయరైన బాధితురాలు ఢిల్లీ నుండి తిరిగి ముంబై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది. నిందితుడు మోహిత్ కన్వర్ గురుగావ్ వాసి.
విమానంలో తన పక్క సీటులో కూర్చొన్న అతను దగ్గరగా జరిగి అసభ్యంగా చేతులు వేయడం అసభ్యంగా తనను తాకడం వంటివి చేశాడని ఆమె ఫిర్యాదుచేసింది.తన పట్ల దుర్బాషలాడడని కూడ ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.












Click it and Unblock the Notifications