బాలీవుడ్ తారలకు అసభ్య వీడియో క్లిప్స్, వ్యక్తి అరెస్ట్

Man sends obscene SMSs to actors, held
ముంబై: బాలీవుడ్ సినీ నటీనటులకు, మోడళ్లకు అసభ్యకర సందేశాలు పంపుతున్న వ్యక్తిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితునిపై సమాచార సాంకేతిక చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 15 వరకు నిందితునికి పోలీస్ కస్టడీ విధించారు.

పోలీసుల కథనం ప్రకారం.. కంప్యూటర్ డిప్లోమా చేసిన హరీష్‌పద్మనాభ భట్ కంప్యూటర్ హార్డ్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అసభ్యకరమైన సందేశాలు, వీడియో క్లిప్స్ వస్తున్నాయని చాలా మంది నటీనటులు, ప్రముఖుల నుంచి తమకు గతనెలలో అనేక ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫిర్యాదు చేసిన వారందరిలో ఎక్కువ మంది బాలీవుడ్ ప్రముఖులే ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారికి ఏ నెంబర్ నుంచి అసభ్యకర సందేశాలు, వీడియో క్లిప్స్ వస్తున్నాయన్నదానిపై దృష్టి సారించారు.

కర్నాటక రాష్ట్రంలోని ఉడిపిలో రిజిష్టర్ అయిన ఓ సెల్ ఫోన్ నుంచి సందేశాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉడిపికి వెళ్లిన ఓ పోలీసుల బృందం నిందితున్ని తన ఇంటిలోనే పట్టుకుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భట్ తను సందేశాలు, వీడియో క్లిప్స్ పంపుతున్న విషయాన్ని ఒప్పుకున్నాడని, ప్రముఖుల నెంబర్లను వెబ్ సైట్ల నుంచి పొందినట్లు నిందితుడు తెలిపాడని విచారణాధికారి మిలింద్ దేశాయ్ చెప్పారు.

నిందితుని ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు సెల్‌ఫోన్, ల్యాప్ టాప్, రెండు డేటా కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు భట్‌ను పోలీసులు విచారించగా సరదా కోసమే సుమారు వందమందికి పైగా ప్రముఖులకు సందేశాలు పంపినట్లు ఒప్పుకున్నాడు. పగటి పూట ఓ కంప్యూటర్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహిస్తూ రాత్రి పూట స్నేహితులతో చాటింగ్, ప్రముఖులకు అసభ్య సందేశాలు పంపుతున్నట్లు నిందితుడు భట్ తెలిపాడు. నిందితుడు భట్‌పై కేసు నమోదు చేసి అక్టోబర్ 15 వరకు పోలీస్ కస్టడీ విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+