ఆర్మీ ఆఫీసర్ భార్యకు అశ్లీల వీడియో పంపించాడు, అరెస్ట్
న్యూఢిల్లీ: ఓ వ్యక్తి రిటైర్డ్ ఆర్మీ అధికారికి అశ్లీల వీడియో పంపి బుక్ అయ్యాడు. ఆమెకు పోర్న్ వీడియో పంపించినందుకు పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది.
దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ కాలనీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు 40 ఏళ్ల మెహతా తమ కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి భార్యకు నాలుగున్నర నిమిషాల నిడివిగల పోర్న్ వీడియోను పంపించాడు.

మెహతా కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాలనీ సమస్యల పైన సదరు అధికారి భార్య వెళ్లి అతడితో మాట్లాడేది. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకొని తనకు అశ్లీల వీడియో పంపించాడని ఆర్మీ అధికారి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని పైన సెక్షన్ 509, ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు అతనిని మంగళవారం నాడు అరెస్డు చేశారు.












Click it and Unblock the Notifications