బాలుడిని రేప్ చేసిన భూస్వామికి పదేళ్ల జైలు
బెంగళూరు: బాలుడిపై అత్యాచారం చేసిన ఓ భూస్వామికి జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించిన ఘటన కర్ణాటకలో జరిగింది. రాకేష్ దశరథ్ అనే పేరు మోసిన భూస్వామికి జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది.
కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని హన్నుక్తి అనే గ్రామంలో నివాసం ఉంటున్న రాకేష్ దశరథ్ పేరుమోసిన భూస్వామి. ఇతని దగ్గర పని చేస్తున్న ఓ కుటుంబంలోని బాలుడు (17) మీద రాకేష్ కన్నుపడింది.
2013 ఏఫ్రిల్ 17వ తేది ఒంటరిగా ఉన్న బాలుడిని రేప్ చేశాడు. తరువాత లైంగిక కోర్కె తీర్చాలని వేధించాడు. ఓ సారి ఇంట్లో బాలుడితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలుడు తనను భూ స్వామి లైంగికంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పాడు.

బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో విజయపుర పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు రాకేష్ నిందితుడు అని సాక్షాలు సేకరించి కోర్టుకు ఇచ్చారు.
విజయపుర జిల్లా రెండో అదనపు సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. రాకేష్ దశరథ్ లైంగిక దాడి చేశాడని వెలుగు చూడటంతో అతనికి పదేళ్లు జైలు శిక్ష విధిస్తున్నామని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. రాకేష్ దశరథ్ ను జైలుకు పంపించారు.












Click it and Unblock the Notifications