ప్రేమించలేదని కాలేజ్ లెక్సరర్ కు నిప్పంటించాడు, ఇప్పటికే భార్య, బిడ్డ, పెళ్లి నాశనం, పగ, ప్రతీకారం

ముంబై/ వార్దా: ప్రేమించలేదని కసి, పగ, ప్రతీకారంతో ఓ కాలేజ్ లెక్సరర్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఇప్పటికే వివాహం జరిగి భార్య, ఓ బాబు ఉన్న వ్యక్తిని ప్రేమించడానికి నిరాకరించిన ఆ యువతి మీద పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె దాదాపుగా కాలిపోయి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఇప్పటికే ఆ యువతి పెళ్లి విచ్చిన్నం చేసిన కిరాతకుడు చివరికి ఆమెను సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించాడు.

ఇద్దరూ స్నేహితులు

ఇద్దరూ స్నేహితులు

మహారాష్ట్రలోని వార్దా జిల్లాలోని హింగణ్ ఘాట్ ప్రాంతంలో అంకిత (25) అనే యువతి, వికేశ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన కావడంతో స్నేహితులు అయ్యారు. అంకిత ఓ కాలేజ్ లో లెక్సరర్ గా ఉద్యోగం చేస్తున్నది.

దూరం పెట్టిన యువతి

దూరం పెట్టిన యువతి

వికేశ్ ప్రవర్తనలో మార్ప రావడంతో గత రెండేళ్ల నుంచి అతన్ని అంకిత దూరం పెట్టింది. అయితే తనను దూరం పెట్టిన అంకితను గత రెండేళ్ల నుంచి తనను ప్రేమించాలని వికేశ్ వేధింపులకు గురి చేస్తున్నాడు. వికేశ్ కు వివాహం అయ్యి 9 నెలల బాబు ఉన్నాడు. అంకిత కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు వికేశ్ ను ఇప్పటికే రెండు సార్లు మందలించారు.

పక్కాప్లాన్ తో మకాం

పక్కాప్లాన్ తో మకాం

సోమవారం అంకిత కాలేజ్ దగ్గరకు బయలుదేరింది. అప్పటికే మార్గం మధ్యలో మకాం వేసిన వికేశ్ కాలేజ్ కు వెలుతున్న అంకితను అడ్డగించాడు. తనను ప్రేమించాలని, లేదంటే చంపేస్తానని అంకితను హెచ్చరించాడు. ఆ సమయంలో వికేశ్ నుంచి తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లడానికి అంకిత ప్రయత్నించింది.

పెట్రోల్ పోసి నిప్పంటించి !

పెట్రోల్ పోసి నిప్పంటించి !

నందోరి చౌక్ వద్ద అంకితను అడ్డగించిన వికేశ్ ఒక్కసారిగా వెంట తీసుకెళ్లిన పెట్రోల్ ఆమె తల మీద పోసి నిప్పంటించాడు. మంటలు వ్యాపించడంతో అంకిత అర్తనాదాలు చేసింది. చుట్టుపక్కల వారు ఆర్తనాదాలు చేస్తున్న అంకితను రక్షించకుండా చోధ్యం చూస్తూ మొబైల్ వీడియోలు చిత్రీకరించారు. అంకితను వెంటనే ఆసుపత్రికి తరలించకపోవడంతో ఆమె సుమారు 40 శాతం అక్కడే కాలిపోయింది.

మృత్యువుతో పోరాటం

మృత్యువుతో పోరాటం

తీవ్రగాయాలైన అంకిత నాగ్ పూర్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తున్నది. అంకితను దారుణంగా హత్య చెయ్యడానికి ప్రయత్నించిన వికేశ్ ను వెంటనే కఠినంగా శిక్షించాలని మహారాష్ట్రలో ఆందోళనలు జరుగుతున్నాయి. అంకితను సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించిన వికేశ్ ను పోలీసులు అరెస్టు చేశారని, అతన్ని కఠినంగా శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ తెలిపారు. గతంలో అంకితకు వివాహం చెయ్యడానికి ప్రయత్నించామని, అయితే వికేశ్ ఆ పెళ్లిని విచ్ఛిన్నం చేశాడని, చిరికి ఆమెను సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించాడని ఆమె సోదరుడు శుభమ్ బోరున విలపిస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+