వామ్మో.. పెళ్లికి పిలవలేదన్న కోపంతో ఎంత పని చేశాడు..?.. చివరికి..!
సాధారణంగా పెళ్లిళ్లకు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారిని ఆహ్వానిస్తాం. వారికి వీలుంటే వస్తారు. లేదంటే లేదు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి.. తనను పెళ్లికి పిలవలేదన్న కోపాన్ని మామూలుగా వ్యక్తపరచలేదు. ఏకంగా తుపాకీ తీసుకొచ్చి పెళ్లికొడుకు తండ్రిని కాల్చేశాడు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వరుడి తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఏం జరిగింది..?
ఉత్తర్ ప్రదేశ్ గాజియాబాద్ జిల్లా ట్రానికా సిటీకి చెందిన ఓ యువకుడి వివాహం మార్చి 22న జరగాల్సి ఉంది. ఈ వేడుకకు ముందు హల్దీ ఫంక్షన్ నిర్వహించారు. అయితే ఈ ఫంక్షన్ కు యువకుడి బంధువులు, కుటుంబసభ్యులు అందరూ వచ్చారు. ఇరుగుపొరుగు వ్యక్తులు కూడా వచ్చారు. కానీ ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తిని మాత్రం పిలవలేదు. దీంతో ఫుల్ గా మద్యం తాగి ఆ వ్యక్తి హల్దీ ఫంక్షన్ కు వచ్చాడు. తనను ఎందుకు ఆహ్వానించలేదని వరుడి కుటుంబంపై విరుచుకు పడ్డాడు. వారిని దుర్భాషలాడుతూ.. మహిళలపైనా దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాక తనతో తెచ్చుకున్న తుపాకీని బయటకు తీసి వరుడు తండ్రిని కాల్చేశాడు. ఈ ప్రమాదంలో వరుడు తండ్రి ఎడమ భుజానికి తీవ్రంగా గాయమైంది. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మాట్లాడుతూ.. "ఆ వ్యక్తిని మేము ఫంక్షన్ కు పిలువలేదు. ఎందుకంటే అతడు ఎప్పుడూ మద్యం మత్తులో ఉంటాడు. పిలిస్తే వచ్చి ఏం రాద్దాంతం చేస్తాడో అన్న భయంతో పిలవలేదు. ప్రస్తుతం నా తండ్రి ఆస్పత్రిలో ఉన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. త్వరలో నిందితుడ్ని అరెస్ట్ చేస్తారు" అని అన్నాడు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications