విమానాశ్రయంలో యువకుడి బీభత్సం: హెలికాప్టర్ ధ్వంసం, విమానం ముందు కూర్చున్నాడు(వీడియో)
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రాజభోజ్ విమానాశ్రయంలో ఓ 20 ఏళ్ల యువకుడు బీభత్సం సృష్టించాడు. ఆదివారం సాయంత్రం విమానాశ్రయంలో ప్రవేశించిన యువకుడు.. ఓ ప్రైవేటు హెలికాప్టర్ ముందు భాగాన్ని రాళ్లతో కొట్టి పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆ తర్వాత ఓ విమానం ముందు వెళ్లి కూర్చున్నాడు .

హెలికాప్టర్ ధ్వంసం చేసి..
అయితే, ఆ యువకుడి మానసిక స్థితి బాగోలేదని, అందుకే ఇలా ప్రవర్తించాడని తెలుస్తోంది. హెలికాప్టర్ ముందు భాగాన్ని ధ్వంసం చేసిన తర్వాత అతడు టేకాఫ్ అవుతున్న స్పైస్‌జెట్ ముందు వెళ్లి కూర్చున్నాడు. దీంతో ఆ విమానం టేకాఫ్ అవడం ఆలస్యమైంది.

వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది..
విమానంలో ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోలనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) దళాలు అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత ఆ యువకుడిని పోలీసులకు అప్పగించాయి. అనంతరం ఆ విమానం అక్కడ్నుంచి బయల్దేరింది.
హెలికాప్టర్ ధ్వంసం.. టేకాఫ్ అయ్యే విమానం ముందు కూర్చుకోవడంతో..
‘ఆదివారం సాయంత్రం 5.45 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. మానసికస్థితి సరిగాలేని 20ఏళ్ల యువకుడు స్టేట్ హ్యాంగర్ సైడ్ నుంచి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. అక్కడేవున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ను రాళ్లతో కొట్టి ధ్వంసం చేశాడు. ఆ తర్వాత టేకాఫ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్ విమానం ముందు కూర్చున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది' అని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications