బాలీవుడ్ హాట్ గర్ల్ చెంప చెళ్ళుమనిపించిన యువకుడు

పొట్టి దుస్తులతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేకెత్తించే ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురొంది. ఒక ముస్లింవై ఉండీ ఇలాంటి దుస్తులు వేసుకుంటావా అంటూ నటి, మోడల్ గౌహర్ ఖాన్ చెంప ఛెళ్లుమనిపించాడు ఓ యువకుడు. అక్కడితో ఆగకుండా.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
అతడి పేరు మాలిక్ అకిల్. వయస్సు 24 ఏళ్లు. గోరేగావ్ శివార్లలోని ఫిలిం సిటీలో ఇండియాస్ రా స్టార్ అనే రియాలిటీ షోని ఆమె నిర్వహిస్తున్నారు. ఆయన మూడు రోజులుగా ఈ షోకు హాజరవుతున్నాడు. ఆదివారం నాడు ప్రేక్షకుల్లోని అకిల్ ఈ దాడికి పాల్పడ్డాడు.
అయితే, అక్కడున్న సెక్యూరిటీ గార్డులు వెంటనే అప్రమత్తమై అతడిని బయటకు ఈడ్చిపారేశారు. పోలీసులు అకిల్‌పై కేసు నమోదు చేశారు. మంగళవారం అతణ్ని కోర్టులో హాజరుపరుస్తారు. మాలిక్ మాత్రం ముస్లిం మహిళ అయిన ఆమె అంత పొట్టి దుస్తులు ధరించకూడదని తన చర్యను సమర్థించుకుంటున్నాడు.












Click it and Unblock the Notifications