నిస్పృహతో సిఎం చెంపపై కొట్టిన వ్యక్తి: క్షమించిన హుడా

చుట్టూ భారీగా జనం రోడ్డుకు ఇరువైపుల ఉన్నారు. అలా ఆయన ఓపెన్ టాప్ జీపులో వెళ్తుండగా అందరు చూస్తుండగానే ఓ యువకుడు జీపు పక్కనున్న భద్రతను ఛేదించుకొని వచ్చి భూపిందర్ చెంప పైన కొట్టాడు. ముఖ్యమంత్రిని కొట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతనిని కమల్ ముఖిజాగా గుర్తించారు. డిఎస్పీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న తనకు పాలకుల పక్షపాత వైఖరి కారణంగా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిస్పృహకు లోనై కమల్ ముఖిజా ఈ పని చేసినట్లు పోలీసులకు చెప్పాడు.
మరోవైపు ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా తన పైన చేయి చేసుకున్న యువకుడిని క్షమించాడు. కమల్ ముఖిజా నిరాశకు లోనై ఈ పని చేసినందుకు ముఖ్యమంత్రి అతడిని క్షమించారని హుడా రాజకీయ సలహాదారు వీరేందర్ ఓ ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications