వేడుక-విషాదం: ఫూటుగా తాగి బీరు బాటిల్‌తో తలపై కొట్టుకున్నాడు, మృతి
ఫూటుగా మద్యం సేవించిన ఓ యువకుడు.. మద్యం మత్తులో బీరు బాటిల్‌తో తన తలపైనే బలంగా కొట్టుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు వదిలాడు.
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వేడుకల్లో పలుచోట అపశృతులు చోటు చేసుకున్నాయి. వేడుకల్లో భాగంగా ఫూటుగా మద్యం సేవించిన ఓ యువకుడు.. మద్యం మత్తులో బీరు బాటిల్‌తో తన తలపైనే బలంగా కొట్టుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. లూథియానాకు చెందిన దీపక్ టాండన్ అనే చిన్న వ్యాపారి కొత్తసంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు తన ఇద్దరు స్నేహితులతో కలిసి న్యూఢిల్లీలోని హాజ్ ఖాస్ గ్రామంలో బార్‌కు వచ్చాడు. ఉత్సవాల్లో మునిగితేలుతూ దీపక్ టాండన్ పీకల దాకా మద్యం తాగాడు.

ఆ తర్వాత మద్యం మత్తులో తనకు నచ్చిన పాట పెట్టాలని నిర్వాహకులను డిమాండ్ చేశాడు. కాగా, మరికొందరు విభేదించడంతో పాట ఎంపిక విషయంలో వారితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో దీపక్ ఆగ్రహంతో ఖాళీ బీరు బాటిల్‌ను తన తలపైనే బలంగా పగలగొట్టుకున్నాడు.
దీంతో అతని తలకు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. వెంటనే దీపక్‌ను పోలీసులు సఫ్ధర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే దీపక్ ప్రాణాలు విడిచాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications