దారుణం : మగాళ్లతో మాట్లాడుతోందని గర్ల్‌ఫ్రెండ్‌ను ఏం చేశాడంటే..
నాగ్‌పూర్ : ఆమె ఓ మోడల్. పెద్ద మోడల్ కావాలన్నది ఆమె కల. అందుకే స్థానికంగా జరిగే ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. అందుకోసం చాలా మందిని కలిసేది. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్‌కు ఇది నచ్చేది కాదు. అదే విషయం ఆమెతో చెప్పాడు. అతని మాటలు లెక్క చేయకపోవడంతో చివరకు ప్రియుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది.

ప్రియురాలిపై అనుమానం..
నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల ఖుషీ పరిహార్ మోడల్. మోడలింగ్ రంగంలో రాణించాలన్న ఆశతో లోకల్ ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. అవకాశాల కోసం చాలా మందితో మాట్లాడేది. అయితే అలా మాట్లాడటం ఆమె బాయ్ ఫ్రెండ్ అష్రఫ్ షేక్‌కు నచ్చేది కాదు. ఎన్నోసార్లు ఆ విషయాన్ని ఖుషీతో చెప్పాడు. అయితే ఆమె కెరీర్‌పై దృష్టి పెట్టి అతని మాటలు పట్టించుకోలేదు. దీంతో అతను ఆమెపై కోపంతో పాటు అనుమానం పెంచుకున్నాడు.

బండరాయితో మోది హత్య
ప్రియురాలిపై అనుమానం పెనుభూతంగా మారడంతో అష్రఫ్ ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పక్కా స్కెచ్ వేశాడు. జులై 12న కారులో ఖుషీని లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లాడు. నాగ్‌పూర్ హైవేపై ఓ సవ్లి ఫతా ప్రాంతంలో ఆమెపై దాడికి దిగాడు. ప్రతిఘటించిన ఖుషీని బండరాయితో మోది చంపాడు. ఎవరూ గుర్తు పట్టకుండా ఆమెను ముఖాన్ని చిధ్రం చేశాడు.

అనుమానంతోనే హత్య
హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించింది. ముఖం గుర్తు పట్టలేని విధంగా మారడంతో సోషల్ మీడియా అకౌంట్ ఆధారంగా ఆమెను గుర్తించారు. దర్యాప్తులో భాగంగా అష్రఫ్ తో కలిసి ఆమె వెళ్లిన విషయం తెలుసుకున్న పోలీసులు అష్రఫ్ షేక్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో నిందితుడు అసలు విషయం బయటపెట్టాడు. ఖుషీ చాలా మంది మగవారితో క్లోజ్‌గా ఉండటంతో ఆమె క్యారెక్టర్‌పై అనుమానంతో హత్య చేసినట్లు అంగీకరించాడు. మర్డర్ కేస్ నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications