Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !

చెన్నై/ నామక్కల్: తన భార్యతో అక్రమ సంబంధం వదులుకోవాలని జ్యోతిష్కుడికి బుధ్దిమాటలు చెప్పిన భర్త దారుణ హత్యకు గురైనాడు. భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్ ఇచ్చినా జ్యోతిష్కుడు, ఆంటీ డోంట్ కేర్ అన్నారు. కొడుకు కళ్ల ముందే అతని తండ్రిని హత్య చేసి పరారైన జ్యోతిష్కుడిని వెంటాడిన పోలీసులు చివరికి అతన్ని అరెస్టు చేశారు. నిత్యం జ్యోతిష్కం చెప్పే ముసుగులో లేడీస్ టైలర్ (ఆంటీ) ఇంటికి వెళ్లి ఆమెతో విచ్చలవిడిగా రాసలీలలు సాగిస్తూ కుటుంబ సభ్యులకు నరకం చూపించిన జ్యోతిష్కుడు చివరికి జైలుకు వెళ్లాడు. భర్త హత్యకు గురైనా ఆ మహిళకు ఏమాత్రం బాధ లేదని, ఆమెను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని పోలీసులు అంటున్నారు.

భర్త కాంట్రాక్టర్, ఆంటీ లేడీస్ టైలర్

భర్త కాంట్రాక్టర్, ఆంటీ లేడీస్ టైలర్

తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాశిపురం సమీపంలోని వెన్నందూరులో కృష్ణన్ (55), అతని భార్య వసంతి (48) నివాసం ఉంటున్నారు. కృష్ణన్, భార్య వసంతి దంపతులకు మోహన్ (25) అనే కుమారుడు ఉన్నాడు. కృష్ణన్ సెంట్రింగ్ కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. వసంతి సొంతంగా లేడీస్ టైలరింగ్ షాప్ నిర్వహిస్తోంది.

కొడుకు పెళ్లికి సమస్యలు !

కొడుకు పెళ్లికి సమస్యలు !

ఇంటిలో చిన్నచిన్న సమస్యలు వస్తున్నాయని, అందుకే కొడుకు మోహన్ పెళ్లి చేయలేకపోతున్నామని వసంతికి అనుమానం వచ్చింది. ఇదే విషయం వసంతి భర్త కృష్ణన్ కు చెప్పింది. ఎవరైనా మంచి జ్యోతిష్కుడికి విషయం చెప్పి ఇంటిలో పూజలు చేయిస్తే మనకు కష్టాలు తీరిపోతాయని, తొందరగా కొడుకు పెళ్లి చెయ్యడానికి సమస్యలు, ఉన్న అడ్డంకులు తీరిపోతాయని వసంతి భర్త కృష్ణన్ కు చెప్పింది.

 జ్యోతిష్కుడి ఎంట్రీ

జ్యోతిష్కుడి ఎంట్రీ

కృష్ణన్, వసంతి దంపతులు తెలిసిన వారి సహాయంతో సేలం జిల్లా చిన్నప్పన్ పట్టికి చెందిన జ్యోతిష్కుడు రామచంద్రన్ (35)ను సంప్రధించారు. మీ ఇంటిలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటికి పరిష్కారం కావాలంటే ప్రత్యేక పూజలు చెయ్యాలనిజ్యోతిష్కుడు రామచంద్రన్ కృష్ణన్, వసంతి దంపతులకు మాయమాటలు చెప్పాడు.

 ఆంటీతో ఇంటిలో రాసలీలలు

ఆంటీతో ఇంటిలో రాసలీలలు

ఇంటిలో పూజలు చేసే ముసుగులో వచ్చి వెలుతున్న జ్యోతిష్కుడు రామచంద్రన్ వసంతితో అక్రమ సంబంధం సాగించాడు. ఓ రోజు కృష్ణన్ పగటిపూట ఇంటికి ఆకస్మికంగా వెళ్లి చూడగా రామచంద్రన్, వసంతి బెడ్ రూంలో నగ్నంగా దర్శనం ఇచ్చారు. జ్యోతిష్కుడు తన కాపురంలో చిచ్చు రేపుతున్నాడని కాంట్రాక్టర్ కృష్ణన్ ఆందోళన చెందాడు.

 భార్య, జ్యోతిష్కుడికి పోలీసులు వార్నింగ్

భార్య, జ్యోతిష్కుడికి పోలీసులు వార్నింగ్

జ్యోతిష్కుడు రామచంద్రన్ ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చి తన భార్య వసంతితో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్న కృష్ణన్ ఇద్దరికీ బుధ్దిమాటలు చెప్పాడు. అయితే వారు మాత్రం పట్టించుకోలేదు. చివరికి కృష్ణన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రామచంద్రన్, వసంతిలను పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చినా వారు మాత్రం పద్దతి మార్చుకోకుండా డోంట్ కేర్ అన్నారు.

 రాత్రి పీకలదాక తాగి నేరుగా ఇంటికి !

రాత్రి పీకలదాక తాగి నేరుగా ఇంటికి !

సోమవారం రాత్రి పీకలదాక మద్యం సేవించిన రామచంద్రన్ నేరుగా ప్రియురాలు వసంతి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని జ్యోతిష్కుడు రామచంద్రన్ కు కృష్ణన్, అతని కుమారుడు మోహన్ చెప్పారు. అయినా పట్టించుకోని రామచంద్రన్ ఇప్పుడు ఒక్కమాట మాట్లాడిన తరువాతే ఇక్కడి నుంచి వెలుతానని రామచంద్రన్ మొండికి వేశాడు.

 పబ్లిక్ లో కత్తితో పొడిచి చంపేశాడు

పబ్లిక్ లో కత్తితో పొడిచి చంపేశాడు

జ్యోతిష్కుడు రామచంద్రన్ నానా హంగామా చెయ్యడంతో స్థానికుల సహాయంతో కృష్ణన్, అతని కుమారుడు మోహన్ జ్యోతిష్కుడు రామచంద్రన్ ను బస్ స్టాండ్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సమయంలో వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని అందరూ చూస్తున్న సమయంలో కృష్ణన్ ను దారుణంగా పొడిచిన రామచంద్రన్ అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు. తీవ్రగాయాలైన కృష్ణన్ ను సేలంలోని జీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే కృష్ణన్ మరణించాడు. కృష్ణన్ ను హత్య చేసి పారిపోయిన జ్యోతిష్కుడు రామచంద్రన్ ను మంగళవారం రాత్రి అరెస్టు చేశామని వెన్నందూరు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+