భార్యను చంపేసి సినిమా స్టోరి చెప్పిన పోలీసు అధికారి
మీరట్: భార్యను దూరం పెట్టి వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నఓ పోలీసు అధికారి భార్యను చంపేసి సినిమా ఫక్కీలో తన రెండు కాళ్ల మీద కాల్చుకుని పై అధికారులకు సినిమా చూపించాడు. పోలీసులు సైతం నిజమే అనుకున్నారు. అయితే తరువాత అసలు విషయం వెలుగు చూసింది.
భార్యను హత్య చేసిన అతను అనుమానం రాకుండా అతని రెండు కాళ్ల మీద పిస్టల్ తో కాల్చుకున్నాడు. దీంతో పోలీసులు సైతం అంతా నిజమే అనుకున్నారు. అయితే అసలు విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు షాక్ కు గురైనారు. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మీరట్-పరిక్షిత్ గఢ్ రహదారి పై తాను, తన భార్య కలిసి కారులో వెలుతున్న సమయంలో దుండగులు వచ్చి కాల్పులు జరిపారని బిజేంద్ర సింగ్ (24) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అతని భార్య మరణించింది.

బిజేంద్ర సింగ్ రెండు కాళ్ల మీద పిస్తల్ తో కాల్చుకోవడంతో బుల్లెట్ గాయాలైనాయి. వెంటనే బిజేంద్ర సింగ్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తరువాత బిజేంద్ర సింగ్ ఈ ఘటన విషయంపై భిన్న కథనాలు చెప్పడం మొదలు పెట్టాడు.
పోలీసులకు అక్కడే అనుమానం మొదలైయ్యింది. పోలీసులు విచారణ మొదలు పెట్టారు. బిజేంద్ర సింగ్ కంటే ఆమె భార్యకు ఆరేళ్లు ఎక్కువ అని వెలుగు చూసింది. బిజేంద్ర సింగ్ కు అనేక మంది మహిళలతో అక్రమ సంబంధం ఉందని పోలీసులు తెలుసుకున్నారు. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు.
పలు వాహనాలు పరిశీలించారు. ఢిల్లీ లో రిజిస్టేషన్ అయిన కారును పోలీసులు అడ్డుకుని పరిశీలించారు. అందులో ముగ్గురు వ్యక్తులు రెండు నాటు తుపాకులు, వాడిన కార్టిడ్ర్జిలు ఉన్న విషయం గుర్తించారు. బిజేంద్ర సింగ్ ఆడిన డ్రామా మొత్తం ఆ ముగ్గురు పోలీసులకు చెప్పారు. పోలీసులు బిజేంద్ర సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications