వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్నీ.. అప్పులు తీర్చుకోవాలని సొంతంగా నోట్లు ముద్రించేశాడు!

విదేశాల్లో చదువుకునే వారి కోసం కొన్నాళ్లు కన్సల్టెన్సీ నడిపిన ఓ వ్యక్తి.. ఆ క్రమంలో భారీగా అప్పులు చేసి, నష్టాలపాలై, తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించేందుకు నకిలీ కరెన్సీ ముద్రణకు తెరతీశాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సూరత్‌: రవీగాంధీ నిన్నమొన్నటి వరకు విదేశీ విద్యాసేవల కన్సల్టెన్సీని నడిపేవాడు. ఈ కన్సల్టెన్సీని నడిపే క్రమంలో రూ. 70 లక్షల వరకు అప్పులు తెచ్చాడు. కానీ, కన్సల్టెన్సీలో భారీగా నష్టాలు వచ్చాయి. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేకపోయాడు.

ఈ నేపథ్యంలో అప్పులు ఇచ్చిన వాళ్లు తీవ్ర ఒత్తిడి చేయడంతో వాటిని చెల్లించేందుకు రవీగాంధీ ఓ పథకం వేశాడు. అదే.. సొంతంగా నోట్లు ముద్రించడం. నకిలీ నోట్లను తానే ముద్రించి.. వాటిని మార్కెట్‌లో చెలామణి చేయడం ద్వారా అప్పులు తీర్చాలనుకున్నాడు.

లక్ష రూపాయల అసలు కరెన్సీ నోట్లకు రూ. 3 లక్షల నకిలీ నోట్లు ఇచ్చే పథకంతో అతను తన అనుచరులతో మార్కెట్‌లోకి దిగాడు. కానీ పోలీసులకు సమాచారం అందడంతో అతని బండారం బట్టబయలైంది. ఇదీ గుజరాత్‌లోని సూరత్‌ పట్టణంలో భారీ నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు వెనుక దాగి ఉన్న కథ.

Man starts printing fake currency to repay Rs 70 lakh debt

నిందితుల నుంచి రూ. 40.73 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సుత్రధారి అయిన రవీగాంధీ (30)తోపాటు అతని అనుచరులు అజయ్‌ పటేల్‌, బాబులాల్‌ అలియాస్‌ బాబ్లూ మహాదేవ్‌ వాంఖడే, వాసులను అరెస్టు చేశారు.

విదేశాల్లో చదువుకునే వారి కోసం కొన్నాళ్లు కన్సల్టెన్సీ నడిపిన రవీగాంధీ.. నష్టాలు వచ్చి పెద్ద మొత్తంలో అప్పులు చేయడంతో.. వాటిని తిరిగి చెల్లించేందుకు నకిలీ కరెన్సీ ముఠాకు తెరతీశాడని పోలీసులు తెలిపారు.

English summary
The special operations group (SOG) of the city police busted a counterfeit note printing and distribution racket on Sunday and arrested four persons. Police recovered fake notes of face value Rs 40.73 lakh from the accused who were trying to circulate the currency in the market.Police arrested Ravi Gandhi (30), a resident of Pandesara, Ajay Patel, Babulal alias Babloo Mahadev Vankhede (47) and Vasu alias Bangali Kashinath Karmakar (33), for printing and selling the counterfeit notes. Gandhi was running foreign study consultancy service and had suffered major losses. He had borrowed around Rs 70 lakh to pay debt and despite all attempts, he was unable to repay the loan. Hence, he planned to print money and sell. The accused told police that they were planning to sell the fake notes of Rs 3 lakh for Rs 1 lakh of originals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X