పెళ్లికి ముందే కాబోయే భార్యపై అనుమానం, హత్య
థానే: మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల్లోనే పెళ్లి జరగాల్సిందనగా కాబోయే భార్యపై అనుమానం పెంచుకున్నాడు ఆమెకు కాబోయే భర్త. ఈ నేపథ్యంలోనే ఆమెను హత్య చేశాడు.
వివరాల్లోకెళితే.. స్థానిక గణేశ్‌పురి ప్రాంతానికి చెందిన కుమార్ వల్మీక్ పటేల్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన మీనల్(20)తో వివాహం నిశ్చయమైంది.

మరికొద్ది రోజుల్లో ఇద్దరూ ఓ ఇంటివారవుతారనగా కుమార్ మీనల్‌పై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మీనల్‌ని డిసెంబరు 4న స్థానిక లాడ్జీకి తీసుకెళ్లి అక్కడ గొంతునులిమి చంపి పరారయ్యాడు.
ఈ ఘటన తదుపరి రోజు వెలుగులోకి వచ్చింది. పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. పోస్ట్‌మార్టంలో ఆమె హత్యకు గురైనట్లు తెలియడంతో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications